మరికల్, డిసెంబర్ 31 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, దివ్యాంగులు, ఒంట రి మహిళలు, వితంతువులకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం లబ్ధిదారులు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసి దాని ప్రతిని తాసీల్దార్‌కు అందజేశారు. అంతకుముందు పట్టణంలో లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముం దు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పింఛన్లు పెంచాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.