పాలమూరు, జూన్ 5 : నీట్ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఈ అకాడమీలో శిక్షణ పొందిన వి ద్యార్థులు 720 మార్కులకు గానూ.. పి.సురేందర్ 695, ఎం.రేవంత్ 655, నయమ ఫాతిమా 609, జె.వెంకటేశ్ 557, సి.ప్రహర్షరెడ్డి 554, అన్షరా తజీన్ 552, ఎం.రక్షిత 546, వీరేంద్రయాదవ్ 540, డి.శ్రీవర్షిత్రెడ్డి 531, కె.ప్ర ణీత్ 515, జి.మౌనశ్రీ 515, హనువర్షిత 508, సాబియా షవార్ 504, ఎండీ మతిన్ 502, వి.బిందు 501 మార్కు లు సాధించారు. అదేవిధంగా 400కు పైగా 60మంది వి ద్యార్థులు సాధించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సా ధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కళాశాల గౌరవ సలహాదారులు కె.మంజులాదేవి, వి.లక్ష్మారెడ్డి, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు అభినందనలు తెలిపారు.