గద్వాలటౌన్, మే 28 : గద్వాలలోని ఏరియా దవాఖాన జిల్లా జనరల్ దవాఖానగా స్థాయి మారిన తీరు మాత్రం మారలేదు. అవే ఇబ్బందులు.. అవే కొరతలు.. అవే అవస్థలు.. అదే నిర్లక్ష్యం.. రోగులతో మర్యాదగా నడుచుకోవాలి.. మెరుగైన వైద్యం అందించాలి అన్న ఉన్నతాధికారుల మాటలు గాలి బుడగలుగానే మారిపోయాయి. ప్రతి రోజు వైద్యం కోసం వచ్చే గర్భిణులు గంటల కొద్ది నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. కూర్చుకోవడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉన్నచోటనే నిల్చునే స్థితిలో లేక కొందరు గర్భిణులు కిందనే కూర్చునే పరిస్థితి నెలకొంది.
అలాగే రోగుల సహాయం కోసం వచ్చే వారి కోసం కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగుల బంధువులు, రోగులను చూడటానికి వచ్చిన వారు చెట్ల కింద నేలమీదనే కూర్చుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కడుపుతో ఉన్న మహిళలకు కల్పించే సౌకర్యాలు ఇవేనా అంటూ గర్భిణుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం రూ. లక్ష లు వెచ్చించి ఏర్పా
టు చేసిన రేడియాలజి హబ్ టెక్నీషియన్లు లేక వృథాగా ఉండి పోయింది. సీటీ స్కాన్, టూడీఈకో ఉన్న ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న రోగుల పట్ల వార్డుబాయ్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. సహాయం కోరితే పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మందుల కొరత లేదంటూనే రోగుల కోరిక మేరకు బయటకు మందులు రాస్తున్నామని వైద్యులు చెప్పడం విడ్డూరంగా ఉంది. పోస్టుమార్టం అయ్యాక శవాన్ని అప్పగించే సమయంలో కొందరు సిబ్బంది వైద్యుల పేరు చెప్పి వేల రూపాయలు డి మాండ్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
గంటల కొద్దీ నిలబడాల్సి వస్తున్నది
ఓపీ రాయించుకునేందుకు గంటల
కొద్దీ నిలబడాల్సి వస్తున్నది. లైన్లో నిలబడాలంటే ఇబ్బందిగా ఉంది. ఓపీ తరువాత డాక్టర్ కలిసేందుకు కూడా నానా అవస్థలు పడుతున్నాము. కూర్చోవడానికి కనీసం బెంచీలన్న ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఓపీ రాయించుకునేందుకు ఓపిక ఉండడం లేదు. పరీక్షలు చేయించుకోవాలంటే ఒక రోజంతా దవాఖానలో ఉండాల్సి వస్తుంది.
– సౌమ్య, గర్భిణి, గద్వాల
పేట దవాఖానకు సుస్తీ
నారాయణ పేట, మే 28 : అనారోగ్యం పాలై తన వద్దకు వచ్చే వారిని బాగు చేసి పంపించే సరారు దవాఖానకే సుస్తీ చేసింది. అందరి మేలు కోరే తనను ఎవరు బాగు చేస్తారనే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. నారాయణపేట జిల్లా దవాఖానను ‘నమస్తే తెలంగాణ’ బుధవారం విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగు చూశాయి. దవాఖానలో కనీసం మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందంటే దవాఖానలో ఏ మేరకు సేవలు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
కనీస మందులను సైతం ఇవ్వకుండా బయటకు పంపిస్తున్న పరిస్థితి ఏర్పడడంతో రోగులు, రోగుల బంధువులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన అంటేనే నిరుపేదలు వస్తారు. ప్రైవేట్ దవాఖానకు పెళ్లి డబ్బులు పెట్టుకోలేకనే ప్రభుత్వ దవాఖానకు వస్త్తే ఇకడ కూడా మందులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సానింగ్లకు సైతం రూ.500 వసూలు చేస్తున్నారు. దీనికోసం ఏకంగా ఆన్లైన్ డబ్బులు చెల్లించేందుకు సానర్ను గోడకు అతికించడం కొసమెరుపు.
డబ్బులు వేసే సానర్ ఫొటోను తీసిన ఫొటో గ్రాఫర్తో ఫొటో తొలగించాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హుకుం జారీ చేయడం కొసమెరుపు. దవాఖాన పై పెచ్చులు ఊడిపోయి ఎప్పుడూ కూలుతుందో అన్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. అంతే కాకుండా వర్షం వచ్చిన సమయంలో గోడలకు కరెంట్ షాక్ వస్తున్నదని రోగులు చెబుతున్నారు. ఇక ఎక్స్ రే గదిలో వర్షం కురుస్తుండడంతో బయట ఎక్స్ రే తీస్తున్న పరిస్థితి దాపురించింది. మొత్తం మీద అందరి ఆరోగ్యం మేలు కోరే సరారు దవాఖాన నేడు వివిధ సమస్యలతో అనారోగ్యం పాలైంది. ఇప్పటికైనా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి జిల్లా దవాఖారలో నెలకొన్న సమస్యలను పరిషరించాల్సిన అవసరం ఎంతో ఉంది.