లింగాల, ఫిబ్రవరి 16 : దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య భౌరాపూర్ పుణ్యక్షేత్రం వెలసింది. చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబికమల్లికార్జున స్వామి కొలువైన ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్తి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా శివరాత్రి సందర్భంగా వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా ఈ నెల 17, 18వ తేదీల్లో జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట గ్రామపంచాయతీ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో భౌరాపూర్ ఆలయం ఉన్నది. శ్రీశైలం క్షేత్రం కంటే 300 ఏండ్ల ముందుగానే భౌరాపూర్ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ.17వ శతాబ్దంలో ఆలయం సమీపంలో చెరువును నిర్మించినట్లు చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి. చెరువు గట్టున చెంచుల ఆరాధ్యదైవంగా కొలిచే భైరవుడి రాతి విగ్రహం వెలిసింది. గతంలో శ్రీశైలం వెళ్లే భక్తులు భౌరాపూర్ మీదుగా కాలినడక కొనసాగించేవారట.
నల్లమల అటవీ ప్రాంతంలో ఎంతో ప్రాశస్తి ఉన్న భౌరాపూర్ ఆలయం సమైక్య రాష్ట్రంలో మరుగునపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పురాతన ఆలయాలకు మహర్దశ చేకూరుస్తున్నారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు భౌరాపూర్ ఆలయం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఏటా అధికారికంగా భ్రమరాంబికమల్లికార్జున స్వామి లోకకల్యాణాన్ని నిర్వహిస్తున్నారు.
చెంచులు లింగమయ్య తర్వాత భౌరాపూర్లోని మల్లికార్జునస్వామిని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. భ్రమరాంబికను తోబుట్టువుగా భావించి భౌరమ్మగా పిలుచుకుంటారు. అందువల్లే గ్రామాని కి భౌరాపూర్ అని పేరు వచ్చిందని గ్రామపెద్దలు చెబుతున్నారు. వే ట కోసం వచ్చిన మల్లికార్జున స్వామి.. లోకకల్యాణార్థం భువిలో వెలసిన భ్రమరాంబను వివాహం చేసుకున్నందున.. స్వామి వారిని చెంచులు మల్లన్న బావగా పిలుచుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం చెంచులే పూజారులుగా వ్యవ హరిస్తున్నారు. శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గం లేని రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెం దిన శివభక్తులు భౌరాపూర్లోని భ్రమరాంబికమల్లికార్జు న స్వామిని, శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి కా లినడకన వచ్చేవారు. చెంచులు భైరవుడి దర్శనం త రువాతే అటవీ ప్రాంతంలోకి వెళ్తారు. ఇప్పుడు భ క్తులు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై వె ళ్తుండడంతో భౌరాపూర్ క్షేత్రం ఆదరణ కో ల్పోయి శిథిలావస్థకు చేరుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో జాతరను తొలిసారి అధికారికంగా నిర్వహించారు.
భౌరాపూర్ చెంచుపెంటలో మహాశివరాత్రిని పురస్కరించుకొని నేటి నుంచి రెండురోజులపాటు జాతరను నిర్వహించనున్నారు. చెంచులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించాం. అటవీ ప్రాంతంలో ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాల్సి బాధ్యత భక్తులదే. ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా ఉన్నది.
– ఉదయ్‌కుమార్, కలెక్టర్, నాగర్‌కర్నూల్