వనపర్తి, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వరి ధాన్యం విక్రయాలు చివరి దశకు చేరుకున్నా యి. వానకాలం సీజన్లో భారీఎత్తున వరిని సాగుచేసిన రైతన్నకు ధాన్యం అమ్ముకోవడానికి తంటాలు పడక తప్పడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ లక్ష్యంగా జిల్లా ఫౌరసరఫరాల శాఖ అంచనాలతో నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటి వరకు లక్షా 91వేల టన్నుల ధా న్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. దీని బట్టి చూ స్తే చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధా న్యం అమ్ముకున్నట్లు అర్థమవుతున్నది. అయితే జి ల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులు డ బ్బులు చెల్లించాలని ఆందోళనలు చేస్తున్నారు. రైతు ల ఖాతాల్లో వేగంగా డబ్బులు జమ చేస్తామన్న ప్ర భుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు.
రూ.70 కోట్లు పెండింగ్
వరి ధాన్యం విక్రయాలు జరిపిన రైతులకు ప్రభు త్వం నుంచి డబ్బులు సకాలంలో అందడం లేదు. ఇలా అమ్మి అలా డబ్బులు తీసుకొండని సర్కార్ ఇచ్చిన హామీ కారణాలేమైనా ఆటకెక్కుతుంది. ఈ పరిస్థితిలో 20రోజులైనా డబ్బులు పడని క్రమంలో అన్నదాతలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.70 కోట్ల వారి అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. అయితే డబ్బులు పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉన్నప్పటికీ రైతులకు అందడం లేదని తెలుస్తోంది. ధాన్యం అమ్మిన తర్వా త ఆ కేంద్రం ద్వారా రావాల్సిన సమాచారం జిల్లా కేంద్రానికి సకాలంలో చేరడం లేదు. దీంతో డబ్బు లు పడని పరిస్థితి ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. ఆయా కేంద్రాలు, రైస్ మిల్లర్ల ద్వారా జిల్లా కేంద్రానికి రైతుల ధాన్యం వివరాల ధ్రువీకరణలు అందకపోవడంతో పెండింగ్ పడుతున్నట్లు తెలిసిం ది. ఆయా శాఖల అధికారుల్లో సమన్వయం లోపించడంతోనే సమయానికి వారి అకౌంట్లలో డబ్బులు జమ కాకపోవడంతో అన్నదాతలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
బోనస్ కోసం ఎదరుచూపులే..
ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇప్పటి వరకు జిల్లాలో 20వేల మం ది రైతులు దాదాపు లక్షా 11వేల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లను ప్రభుత్వానికి విక్రయించారు. అయితే వీరిలో ఇంకా చాలా మంది రైతులకు బోన స్ డబ్బులు రాలేదని చెబుతున్నారు. దాదాపు రూ. 25 కోట్ల బోనస్ పడాల్సి ఉన్నట్లు రైతులు అంచ నా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రారంభంలో ఎంఎస్పీ ధర ప్రకారం డబ్బులు పడిన రెండు, మూడురోజులకే బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో పడ్డాయని చెబుతున్నారు. క్రమంగా బోనస్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ జాప్యం చేస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం డబ్బులు పడిన రైతులకు 15 రోజులు గడిచినా కూడా సన్న వడ్ల బోనస్ పడటం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో రెండు రకాలుగా రైతులు వరి ధా న్యం డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు.
మిగతా ధాన్యం ఎక్కడ..?
జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ లక్ష్యం ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల ద్వారా సగం ధాన్యాన్ని కూడా కొనుగోళ్లు చేయలేదని లెక్కలు చెబుతున్నాయి. వీటిని బట్టి మిగితా ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉం దా..లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారా అన్నది స్పష్టం రావడం లేదు. జిల్లాలో 262కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను ప్రభు త్వం ప్రారంభించింది. నవంబర్ నెల నుంచి కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్నది. రెండు నెలలుగా విక్రయాలు జరుగుతున్నా.. ఇంకా జిల్లాలో సగం కూడా ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు కనిపించడం లేదు. దీనిని బట్టి మిగిలిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తే…ఇంకెంత కాలం పడుతుందోనన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.
నెలరోజులైనా డబ్బులు రాలే..
నేను ప్రభుత్వానికి 109 క్వింటాళ్ల బియ్యాన్ని అ మ్మాను. ధాన్యం అమ్మి నెల రోజులైనా ఇప్పటికీ డ బ్బులు నా అకౌంట్లో జమ రాలేదు. అదేవిధంగా దాదాపు నాకు రూ.60 వేలు బోనస్ రావాల్సి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారం లో ఉన్నప్పుడు రైతుబంధు పథకం ద్వారా ఎకరా కు రూ.4వేల చొప్పున ఇచ్చింది. దాని వలన పంట సాగుకు పెట్టుబడిగా రైతుబం ధు పథకం ద్వారా వచ్చిన పైసలను వాడుకునేవా ళ్లం. కాంగ్రెస్ ప్రభు త్వం రైతు భరోసా ఇస్తామని చెప్పి నా ఇప్పటి వర కు చెల్లించలేదు. చాలా సార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా లాభం లేదు.
– సంజీవరెడ్డి, రైతు, వడ్డేవాట, కొత్తకోట మండలం
డబ్బులెప్పుడిస్తారో తెలియదు..
నాపేరు మడిగ నర్సింహ, మాధవరావుపల్లి గ్రా మం, పాన్గల్ మండలం. నాకున్న 2.35 ఎకరా ల్లో వరిసాగు చేస్తే 193 సన్నరకం బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. సింగిల్విండో అధికారులు, సిబ్బంది ధాన్యం బస్తాలు లోడ్ చేసి తీసుకుపోయారు. పది రోజులు అవుతున్నా నా బ్యాంక్ ఖా తాలో డబ్బులు జమ కాలేదు. ఇంటి అవసరాలతోపాటు ఇతర అవసరాల నిమిత్తం డబ్బుల కో సం ఎదురు చూస్తున్నాను. చాలా మంది రై తులకు డబ్బులు పడలేదని తెలుస్తోంది. ధాన్యం అమ్మేది ఓ ఎత్తు అయితే డబ్బులు ఖాతాలో పడడం మరో ఎత్తుగా మారింది. కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటి వరకు రైతుభరోసా ఇవ్వలేదు. ఇస్తారో.. ఎగ్గోడతారో చూడాలి.
ఇంకా డబ్బులు జమ కాలేదు..
నాపేరు రాములు. కేతేపల్లి మా గ్రామం, పాన్గల్ మండలం. నాకున్న 3.20 ఎకరాల్లో బీపీటీ సన్నరకం వరిసాగు చేశాను. 153 బస్తాలు పంట దిగుబడి రాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రంలోనే అమ్మాను. ధాన్యం అమ్మి 11 రో జులు అయినా డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. డబ్బులు ఎప్పడు పడతాయని నిర్వాహకులను అడుగగా అప్పుడు.. ఇప్పుడు.. అంటూ తిప్పుతున్నారు. డబ్బులు అ కౌంట్లో జమ అయితేనే పంటసాగుకు తెచ్చిన అ ప్పులు కట్టాలి. మళ్లీ యా సంగి పంట సాగుకు పెట్టుబడికి కావాలి. ధాన్యం కొ నుగోలు చేసిన వెంటనే డ బ్బులు వస్తే మా అవసరాలు తీరే అవకాశం ఉంది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే తప్పా ఎవరికీ డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు.