మహబూబ్‌నగర్, అక్టోబర్ 10 : ఎన్నికల నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ జి.రవినాయక్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లి క్, ప్రైవేట్ స్థలాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు, కరపత్రాలు, ఫ్లెక్సీలను తొలగిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్కాడ్లు, సర్వైలెన్స్ బృందాలు ఉం టాయన్నారు. సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల్లోపు ఎలాంటి ప్రచారం చేయకూడదన్నారు. చర్చీలు, మసీదులు, ఆలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఎలాంటి ప్రచారం చేయొద్దన్నారు. వ్యక్తులు, పార్టీలపై వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 272 పోలింగ్స్టేషన్లు, 2,43,331 ఓటర్లు.., జడ్చర్లలో 274 పోలింగ్స్టేషన్లు, 2,12,384 ఓటర్లు.., దేవరకద్రలో 289 పోలింగ్స్టేషన్లు, 2,28,077 ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో దివ్యాంగులు 12,931, 80 ఏం డ్లు పైబడిన వారు 6,821 మంది ఉన్నారన్నారు. ప్ర త్యేక అవసరాలు గల వారి ఇంటికి వెళ్లి ఓటు వేసే స దుపాయం కల్పిస్తామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా సీ విజిల్ యాప్ లేదా 1950 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. వెంటనే ఎన్నికల అధికారులు చే రుకొని సమస్యను పరిష్కరిస్తామన్నారు.
107 పీఎస్‌లను క్రిటికల్‌గా గుర్తించాం : ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావారణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నర్సింహ తెలిపారు. జిల్లాలో 878 పోలింగ్స్టేషన్లు ఉన్నాయని, 93 రూట్లను విభజించామన్నారు. 107 పీఎస్‌లను క్రిటికల్‌గా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆభరణాలు, రూ.50వేలకుపైగా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే అవసరమైన పత్రాలను దగ్గర ఉంచుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్‌షోలతోపాటు ప్రతి మైక్‌కు పర్మీషన్ తీసుకోవాలని తెలిపారు.