పాలమూరు, జనవరి 31: పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు సేవలు మరవలేనివని పీయూ ఉపకులపతి లక్ష్మీకాంత్‌రాథోడ్ అన్నారు. బుధవారం రిజిస్ట్రార్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంగతాయారు రిజిస్ట్రార్‌తోపాటు వివిధ హోదాల్లో ఎంతో నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేశారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వివరించారు.
అనంతరం వీసీతోపాటు ప్రొఫెసర్లు, అ ధ్యాపకులు రిజిస్ట్రార్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రకిరణ్, ఆడిట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డితోపాటు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, పీయూ సిబ్బంది పాల్గొన్నారు.