– ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
పాలమూరు, అక్టోబర్ 13 : మనసులో ఉన్న అవలక్షణాలను జయించినప్పుడే నిజమైన దస రా పండుగ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలో దసరా వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలుర కళాశాల మైదానంలో రావణ దహనాన్ని వీక్షించారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ ష బ్బీర్అహ్మద్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, దసరా ఉత్సవ కమిటీ అ ధ్యక్షుడు మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.