మహబూబ్నగర్ కలెక్టరేట్, నవంబర్ 15 : కేంద్ర జనన విభాగం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) నివేదిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబ ంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున్నట్లు తేలింది. 2022లో 41, 959 మంది బా లురు, 37, 583 మ ంది ఆడపిల్లలు జన్మించారు. అంటే 4,376 మంది ఆడ పిల్లలు తక్కువగా జన్మించారు. 2023లో 42,953 మగపిల్లలు, 38,037 ఆడ పిల్లలు జ న్మించగా 4,916 మంది తక్కువగా ఉన్నారు.
గద్వాల జిల్లాలోనే శిశు మరణాలు అధికం
ప్రసవ సమయంలో శిశు మరణాలు పరిశీలిస్తే రెం డేళ్లలో నాగర్కర్నూల్ జిల్లాలో ఒక్కటీ లేదు. వనపర్తి జిల్లాలో 2022లో 6 మరణాలు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 2022లో 15 శిశు మరణాలు చోటు చేసుకోగా 2023లో 12 ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 20 22లో 97 మంది, 2023లో 58 మం ది మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఇక జోగుళాంబ-గద్వాల జిల్లాలో 2022లో 115 మంది, 2023 లో 100 మంది మృతి చెందా రు. ఉమ్మడి పాలమూరు జి ల్లాలో రెండేళ్లలో మొత్తం 403 మంది చనిపోతే అందులో 222 మంది మగ శిశువులు, 181 మంది ఆడ ప్రసవ సమయంలో మృత్యు ఒ డిలోకి చేరుకున్నారు.
పెరిగిన సాధారణ మరణాల సంఖ్య
సాధారణ చిన్నారుల మరణాలు సం ఖ్య పెరిగింది. 2022లో 16, 220 మంది.. 2023లో 17,749 మంది మరణించారు. ఈ లెక్కన ఏ డాది వ్యవధిలోనే 1,529 మంది అధిక ంగా చనిపోయారన్నమా ట. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వ్యాధులకు సరైన చికిత్స తీసుకోవడం లో నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.
పదేండ్ల కిందట..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2013లో జననాలు 43,826 ఉండగా.. అందులో బాలు రు 21,996 మంది, బాలికల సంఖ్య 21,830గా నమోదైంది. అంటే బాలుర కం టే బాలికల సంఖ్య కేవలం 166 మాత్రమే తక్కువ. సాధారణ మరణాలు 18,569 ఉం డగా.. అందులో పురుషులు 8,920, మ హిళలు 9,649 ఉన్నారు. ప్రసవ స మయంలో శిశు మరణాలు 388 ఉండగా.. బాలు రు 186 మంది, బాలికలు 202 మంది చనిపోయారు.
కారణాలు ఇవే..
వారసుడు మగబిడ్డే అన్న అభిప్రాయం ఇం కా పూర్తిగా మారకపోవడం.. గర్భంలో ఆడపిల్ల అని తెలిస్తే చాలు గర్భవిచ్ఛిత్తి చేయించుకోవడం, స్కానింగ్ కేంద్రాలు నిబంధనలుకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ చేయడం.. కొన్ని ప్రైవేట్ క్లినిక్లలో ఆర్ఎంపీలు, మధ్యవర్తుల సాయంతో గర్భవిచ్ఛిత్తి చేయడం.
భరోసా కల్పిస్తేనే..
ఆడ పిల్లల జననాలు తగ్గితే భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించాలి. వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. దవాఖానలు, స్కా నింగ్ కేంద్రాలపై వైద్యాధికారులు నిఘా పెంచాలి. మహిళా సాధికారతను పెంపొందిస్తూ లింగ వివక్షను తొలగించాలి. అప్పుడే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది.
ఉమ్మడి జిల్లాలో జననాలు ఇలా..
