గద్వాల అర్బన్, అర్బన్ 28 : హోటళ్లు, రెస్టారెంట్లు, క్లినిక్స్ తదితర వాటికి ఫోన్ చేసి నేను ము న్సిపల్ కమిషనర్‌ను మాట్లాడుతున్నా.. లైసెన్స్ గ డువు ముగిసినా ఇంకా రెన్యువల్ చేసుకోరా.. కలెక్టర్ గారు రెన్యువల్ విషయంపై ఆరా తీస్తూ ఏం చే స్తున్నారు? వెంటనే వసూలు చేయండంటూ ఆదేశిస్తున్నారు. మీరేమో పట్టించుకోవడం లేదు.. వెంట నే డబ్బులు ఫోన్‌పేలో ట్రాన్స్ఫర్ చేయండి.. లైసె న్స్ రెన్యువల్ చేస్తా అంటూ.. ఓ సైబర్ నేరగాడు డ బ్బులు వసూలు చేసి పోలీసుకలకు చిక్కిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. సీఐ భీమ్‌కుమార్ కథనం మేరకు.. శరత్‌చంద్రారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 16వ తేదీన.. ‘నేను మున్సిపల్ కమిషనర్‌ను అంటూ ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి మీ రెస్టారెంట్ లైసెన్స్ గడువు ముగిసిపోయి చాలా రోజులైంది. ఎందుకు ఇంకా రెన్యువల్ చేసుకోలే దు? గడువు ముగిసినా మీరు చూసుకోరా.. మీరేం పట్టన్నట్లు ఉంటారు.. కలెక్టర్ గారు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో చెప్పండంటూ రెస్టారెంట్ నిర్వాహకులు నమ్మేలా సైబర్ నేరగాడు వ్యవహరించాడు. దీంతో హిమాలయ రెస్టారెంట్ నిర్వాహకులు సార్.. మా రెస్టారెంట్ రెన్యువల్ రెం డు నెలల కిందటే చేశామని సమాధానమిచ్చారు. దీంతో మీ రెన్యువల్ పేపర్లు వాట్సాప్‌కు పెట్టండి.. ఒకసారి చూస్తానని చెప్పండంతో వారు పంపారు. గడువు ముగిసేలోపు ఇలాగే రెన్యువల్ చేసుకోవాలని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశారు. అనంతరం ఫుడ్‌వరల్డ్ రెస్టారెంట్ నిర్వాహకులకు ఫోన్ చేసి ఇ లాగే మాట్లాడాడు. దీంతో వాళ్లు సార్ నేను రేపు ఆ ఫీస్‌కు వచ్చి రెన్యువల్ చేసుకుంటా.. రేపటి వరకు టైం ఇవ్వండని అడిగాడు.
ఇప్పటికే చాలా సమయమైంది. రెన్యువల్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మీకు తెలుసా..? దానికోసం ప్రత్యేక వెబ్సైట్ ఉం ది. మీరు డబ్బులు ఫోన్‌పే చేయండని స్కానర్ పం పించాడు. బాధితుడు స్కానర్‌కు రూ.7వేలు ఫోన్‌పే చేసి త్వరగా చేయండి సార్ అంటూ ఫోన్ పెట్టేశా డు. మరుసటి రోజు బాధితుడు ఫోన్ చేయగా మా సిబ్బంది రెన్యువల్ పేపర్లు తీసుకొచ్చి ఇస్తారు.. అదనంగా రూ.500 ఫోన్‌పే చేయండని చెప్పాడు. మళ్లీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించాడు. వెంటనే అవతలి వైపు నుంచి ఫోన్ కట్ చేశాడు. బా ధితుడికి అనుమానం వచ్చి ఫోన్ లిస్ట్ చెక్ చేసుకోగా తన నెంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు గుర్తించాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా సైబ ర్ నేరగాడు నెల్లూరు బస్డాండ్‌లోని ఓ షాపు నిర్వాహకుడి దగ్గరకు వెళ్లి తమ బంధువులు ఫోన్‌పేకు డబ్బులు వేస్తారు.. అమౌంట్ ఇవ్వండని సదరు రె స్టారెంట్ వ్యక్తి వేసిన నగదును తీసుకున్నాడు. ఎస్పీ రితిరాజ్ ఆదేశాల మేరకు.. సీఐ భీమ్‌కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో సై బర్ నేరగాడు గద్వాల బస్డాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుడడంతో పోలీసులు ప ట్టుకొని విచారించారు. సైబర్ నేరగాడు ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని కడప జిల్లా రామచంద్రపురం గ్రా మానికి చెందిన బిల్ల నాగేశ్వర్రావుగా గుర్తించారు. ఇతడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ర్టాల్లో మున్సిపల్ అధికారి పేరుతో చాలామందిని మోసం చేసి పరారైనట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో చాలా కేసులు న మోదైనట్లు గుర్తించారు. సైబర్ నేరగాడిని శనివారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశిస్తూ తీర్పు వెల్లడించారు.