కొల్లాపూర్ రూరల్, మే 15 : కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. ‘విద్యుత్ ఇవ్వాలని రెండుగంటల పాటు ఎన్నికలు బహిష్కరించిన చెంచులు’ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైనది. దీంతో బుధవా రం సంబంధిత అధికారులు కరెంట్ తీగలతోపాటు ఒక స్తంభం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అభివృద్ధికి దూరంగా ఉన్న చెంచుగూడెంలో మౌ లిక వసతులు కల్పించాలని మాజీ ఉపసర్పంచ్ మల్లేశ్ ప్రభుత్వాన్ని కోరారు.