మక్తల్, ఆగస్టు 10 : పచ్చనిచెట్లే ప్రాణకోటి జీవనాధారమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంతో మొక్కలు నాటించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా లక్షల్లో మొక్కలను నర్సరీల్లో పెంచి నాటి వాటి పర్యవేక్షణ బాధ్యతలను సైతం పర్యవేక్షించారు. నాడు ఆయన మహా సంకల్పంతో నాటించిన మొక్కలు నేడు పెరిగి పెద్దవై బాటసారులకు నీడనివ్వడమే కాకుండా పచ్చదనాన్ని పంచుతున్నాయి.
రోడ్ల వెంట నాటిన మొ క్కలు రహదారులకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రా రంభమైన ఈ మహత్తర పచ్చని విప్లవం రోడ్లకు ఇరువైపులా విస్తరించాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు హరితహారం చేపట్టడంతో పల్లెలు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. 2015 సంవత్సరంలో రాష్ట్రంలో పచ్చదనం 24శాతం మాత్రమే ఉండగా, 2015 సంవత్సరంలో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం ద్వా రా మొకలు నాటే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొకలు, ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు పూలు, పండ్లు, ఔషధ మొక్కలను అందజేసేవారు. అలాగే అడవుల విస్తరణకు సైతం బాల్స్ తయారు చేసి విసిరేవారు. కేసీఆర్ సంకల్పబలంతో 240కోట్లకు పైగా నాటిన మొక్కల్లో 85శాతం వరకు పెరిగినట్లు అటవీశాఖ లెకల ప్రకారం తెలుస్తున్నది.
రహదారి వెంట ఆహ్లాదకరం..
కేసీఆర్ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్ర మం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నాడు నాటిన మొక లు నేడు మానులై, రహదారికి ఇరువైపులా పచ్చదనం తో కనువిందు చేస్తున్నాయి. భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చేలా కేసీఆర్ సార్ మొక్కలను నాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు. కాలుష్యాన్ని సైతం నివారించే దిశగా తెలంగాణ పల్లె ప్రాంతాలు నిలువెత్తు సాక్షాలుగా నిలుస్తున్నాయి.
-మారుతిగౌడ్, మాజీ ఎంపీటీసీ, చిట్యాల
ఎటుచూసినా పచ్చదనమే..
కేసీఆర్ సర్కారులో మొ క్కలు విరివిగా నాటేవారు. వానకాలం వచ్చిందంటే న ర్సరీల్లో మొక్కలు సిద్ధమయ్యేవి. వాటిని అడవుల్లో, ఇండ్లకు, రోడ్లకు ఇరువైపు లా నాటారు. నేడు అవే చెట్లు పెరిగి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నాయి. ప్రస్తు తం కాంగ్రెస్ సర్కారు మొక్కలు నాటే కార్యక్రమాలు ఏవీ చేపట్టడం లేదు. మొక్కలు నా టడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు చేకూరుతుంది. – బెల్లం శ్రీనివాసరెడ్డి, ముష్టిపల్లి