అలంపూరు/రాజోళి, జనవరి 29 : ఏ ప్రభుత్వం అ యినా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి విన్నపాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నడుచుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలచే ఏర్పాటైన ప్రభుత్వం ప్ర జల మాట వినాలని సూచించారు. రాజోళి మండలం పె ద్ద ధన్వాడ గ్రామ రైతులు మా ప్రాంతంలో ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు బుధవారం ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఎమ్మెల్సీ చల్లా మద్దతు పలికారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ రైతులకు కీడు చేసే కంపెనీలు రద్దయ్యే వరకు మీ వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఏ దైనా కంపెనీ ఏర్పాటు చేయదలచినప్పుడు స్థానిక రైతుల అభిప్రాయ సేకరణ తీసుకోకుండా ఎక్కడా ఏ కంపెనీ ఏ ర్పాటు చేయవద్దన్నారు.
అలాంటిది బంగారు పంటలు పండే నడిగడ్డ ప్రాంత నల్లరేగడి భూముల్లో గ్రామాల మ ధ్య చిచ్చుపెట్టె ఇథనాల్ కంపెనీ వద్దని స్థానికులు గత మూ డు నెలల నుంచి రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్ర శ్నించారు. రైతుల పక్షాన గత రెండునెలల కిందట కలెక్టర్, సీఎం రేవంత్‌రెడ్డికి కూడా కంపెనీని రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లా నిర్మల్‌లో ఇలాంటి కంపెనీనే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని రద్దు చేసింది. ప్రజల మనుగడుకు, పర్యావరణ పరిరక్షణకు నష్టం కలిగించే అ న్ని కంపెనీల అనుమతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల వెన్నంటే ఉంటాం :అలంపూర్ ఎమ్మెల్యే, విజయుడు
రైతులకు నష్టం చేసే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు అనుమతులను ప్రభుత్వం రద్దు చేసేంతవరకు వదలమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా వారి వెన్నంటి ఉండి కాపాడుకుంటామన్నారు. పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టె కంపెనీ మా ప్రజలకొద్దని చెప్పారు. రైతులకు ప్రభుత్వాలు మేలు చేయక పోయినా ఫర్వాలేదు కానీ కీడు మాత్రం చేయవద్దని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంపెనీ ఏర్పాటుపై పునరాలోచన చేసి దానిని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివి ధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.