అయిజ, జూన్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.రెండు వేలు ఉన్న పింఛన్‌ను నాలుగు వేలు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.ఆరువేలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఏర్పాటు చేసి ఏడునెలలు కావస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో నెలనెలా మొదటి వా రంలోనే పింఛన్లు వచ్చేవని, కాంగ్రెస్ సర్కారొచ్చినంక నెల ము గుస్తున్నా పింఛన్లు పడడంలేదని ఆరోపించారు. పింఛన్ పెంచేది దేవుడెరుగు పాత పింఛన్లు అయినా నెలనెలా ఇవ్వాలని ల బ్ధిదారులు డిమాండ్ చేశారు. మంగళవారం అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో అయిజ, గద్వాల రహదారిపై పింఛన్ల పెంపు, నెలనెలా పింఛన్లు ఇవ్వడం లేదని ఆసరా లబ్ధిదారులు రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆసరా పింఛన్లు డబుల్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడని, ఎన్నికల్లో గెలుపొంది ఏ డు నెలలు కావస్తున్నా పింఛన్లపై మాట నిలబెట్టుకోవడం లేదని లబ్ధిదారులు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నెలనెలా పిం ఛన్లు వస్తే మందులు, మాకులు తెచ్చుకొనేవాళ్లమని, సకాలం లో పింఛన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా లబ్ధిదారులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి రాస్తారోకోలో పా ల్గొని సంఘీభావం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చి న మాటకు కట్టుబడి లబ్ధిదారులకు పింఛన్లు పెంచాలని డిమాం డ్ చేశారు. గంటపాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు ఎ క్కడిక్కడే నిలిచిపోయాయి. ఎస్సై విజయ్‌భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని లబ్ధిదారులకు నచ్చచెప్పి విరమింపజేశారు.