అనుక్షణం.. అన్నదాత వెంటే..
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. రైతులందరూ ఒకేచోట కూర్చొని సాగుపై చర్చించుకునేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. అంతేకాకుండా ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించింది.
- క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం
- సకల సౌకర్యాలు కల్పించిన సర్కార్
- ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవో నియామకం
- నిత్యం అవగాహన సదస్సుల నిర్వహణ
- సాగుపై మెళకువలతో సత్ఫలితాలు
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. రైతులందరూ ఒకేచోట కూర్చొని సాగుపై చర్చించుకునేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. అంతేకాకుండా ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించింది. వ్యవసాయ విస్తరణ అధికారులు నిత్యం తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల పంటలకు సోకే తెగుళ్లను పరిశీలించి పిచికారీ చేయాల్సిన మందులు, సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు. పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిం చేందుకు చొరవ చూపుతున్నారు. ఏఈవోలు నిత్యం అందుబా టులో ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి/అయిజ రూరల్, ఏప్రిల్ 28 : ఉమ్మడిరాష్ట్ర పాలనలో వ్యవసాయం దండుగలా మరుగున పడగా.. స్వరా ష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సాగును పండుగలా చేశారు. సకాలంలో సాగునీరు అందుతుండడంతో బీటలు పారిన నేలలు నేడు ఆకుపచ్చగా మారాయి. వలసలు వెళ్లిన వారు సైతం తమకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేసుకుంటున్నారు. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. సాగునీటి రాకతో పంటల విస్తీర్ణం సైతం పెరిగింది. ఈక్రమంలో గతంలో పరిమిత సంఖ్యలో ఉన్న ఏఈవోలను సైతం ప్రభుత్వం పెంచింది. రైతులంతా ఒకచోట కూర్చొని సమస్యలపై చర్చించుకునేందుకు, వాకి సలహా లు, సూచనలు ఇ చ్చేందుకు క్లస్టర్ల వా రీగా రైతువేదికలను ఏ ర్పాటు చేసింది. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సాగుకు సలహాలు ఇస్తున్నారు. కాగా 2017లో ప్రభుత్వం ప్రతి 5వేల ఎకరాలకో ఏఈవో చొప్పున నియమించింది.
అందుబాటులో ఉంటూ..
రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, రాయితీలను రైతులు ఎలా వినియోగించుకోవాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి అంశాలపై ఏఈవోలు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. క్లస్టర్ల వారీగా నియమితులైన ఏఈవోలు రైతు వేదికలో నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఉపయోగపడుతున్నారు.
సలహాలు, సూచనలిస్తూ..
దుక్కి దున్నడం మొదలు.. పంట చేతికొచ్చే వరకు.. భూ సారానికి అనుగుణంగా ఏయే పంటలు సాగు చేయాలి? ఎటువంటి విత్తనాలు విత్తాలి.. ఏరకమైన మందులు పిచికారీ చేయాలి.. ఏపంటకు ఎంత నీరు అందించాలి.. ఏ ఎరువులు వాడాలి.. సస్యరక్షణ చర్యలు, పంటల మార్పిడి విధానంపై అవగాహన, సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం.. పంట ఉత్పత్తులను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను అందించడం.. ఇలా ఏఈవోలు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ.. తమ సహాయ సహకారాలను అందిస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాం..
రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ వ్యవసాయ రంగంలో అ ధిక దిగుబడులు సాధించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ప్రభుత్వం అన్నదాత అభివృద్ధికి చేపడుతున్న ఎన్నో పథకాలను వా రికి అందేలా కృషి చేస్తున్నాం. పంటసాగు, తెగుళ్లు, సస్యరణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – లోకరాజు, ఏఈవో, ఉత్తనూరు
విధుల్లో 105మంది ఏఈవోలు
ఏఈవోల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. జిల్లాలో 105 మంది ఏఈవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సలహాలు, సూచనలు పాటిస్తూ అన్నదాత అధిక దిగుబడి సాధిస్తున్నా డు. రైతులు సాగుచేసే పంటలకు సం బంధించి ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకుంటే మరింత దిగుబడి పొందే
అవకాశం ఉంది. – గోవిందునాయక్, డీఏవో, గద్వాల జిల్లా
రైతు అభివృద్ధే ధ్యేయంగా..
రైతుల అభివృద్ధే ధ్యేయంగా మేము పని చేస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వ్యవసాయంలో కొత్త విధానాలపై అవగాహన కల్పిస్తూ.. లాభదాయ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం.. అన్నదాతకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అధిక దిగుబడులు సాధించేలా సలహాలు, సూచనలు ఇస్తున్నాం. సాగులో సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కృష్ణయ్య, పెద్దమందడి క్లస్టర్, ఏఈవో
సలహాలు తీసుకుంటున్నాం
వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతోనే పంటలు సాగు చేస్తున్నాం. ఏఈవోలు నిత్యం అందుబాటులో ఉంటూ మాకు మంచిగా సలహాలు ఇస్తున్నరు. అందుకే దిగుబడి కూడా పెరిగింది. ప్రభుత్వ మద్దతుధరకు పంటలను అమ్ముకునేలా సహకస్తున్నరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందేలా చూస్తున్నరు.
– పర్వతాలు, రైతు, పొల్కెపహాడ్ గ్రామం, గోపాల్పేట మండలం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

