రెండురోజుల్లో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయాలి
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జడ్చర్లలోని పత్తిమార్కెట్లో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
- లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనచేస్తాం
- కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర
- ప్రజాపాలన అంటూ రైతులపై నిర్లక్ష్యం
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
- మక్క కొనుగోలు కేంద్రాన్ని పరిశీంచిన మాజీ మంత్రి
జడ్చర్ల, మే 4 : జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జడ్చర్లలోని పత్తిమార్కెట్లో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నెలరోజుల నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఇప్పటివరకు కొనుగోలు చేయడంలేదని, కొనుగోలు చేసిన మక్కలను ఎత్తక పోవడంవల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వారు తమగోడును వినిపించారు. ఎప్పడు వర్షం పడుతుందోనని, మక్క ధాన్యం తడిసిపోతుందోమోనని భయభయంగా గడుతున్నామని సమస్యను మాజీ మంత్రి కి వివరించారు. మార్కెట్లో పర్యటిస్తున్న సందర్భంగా కొన్ని మొక్కజొన్న బస్తాలు వర్షానికి తడిసి మొలకెత్తడాన్ని ఆయన పరిశీలించారు. మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఇ బ్బందులకు గురిచేయరాదని లక్ష్మారెడ్డి మార్క్‌ఫెడ్, పీఏసీసీఎస్ అధికారులతో మాట్లాడారు.
అనంతరం విలేకరులతో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దుతు ధరలు క ల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని కానీ అవి ఎక్కడా లేవన్నారు. నియోజకవర్గంలో రెండు మాత్రమే ఉన్నాయని అవికూడా సరిగా పనిచేయడం లేదన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి న బాధ్యత ఉందన్నారు. ఎక్కడ ఏపంట వేశారో, ఎంతదిగుబడి వస్తుందో లెక్కలు చూసి అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రజాపాలనలో రైతులు గోసపడుతున్నారని, ప్రజాప్రతినిధు లు, అధికారులు పట్టించుకోకుండా ఏంపని చే స్తున్నారో అర్థకావడంలేదన్నారు. ఇప్పటికే మొక్కజొన్న కొనడంలేదని రైతులు ధర్నా చేశారని అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలను దశల వారీగా ఎత్తివేసే కుట్ర చేస్తుందన్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి రైతులకు మద్దతు ధరలను అందించినట్లు గుర్తుచేశారు. మొక్కజొన్న కొనుగోలు చేయని ప్రభు త్వం వరిధాన్యాన్ని ఎలా కొంటుదని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి రైతులు తీసుకొచ్చిన పంటల ఉ త్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అధికారులతో మాట్లాడి మొక్కజొన్నను వెం టనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వాటిని వెంటనే లారీల్లో గోదాంలకు తరలించి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. రెండురోజుల్లో మొత్తం పంటను కొనాలని లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సారికారామ్మోహన్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రఘుపతిరెడ్డి, టైన్ అధ్యక్షుడు మురళి, బీఆర్ఎస్ నాయకులు యాదయ్య, శ్రీకాంత్, ఇంతియాజ్‌ఖాన్, పర్వత్‌రెడ్డి, శంకర్‌నాయక్, ప్రభాకర్‌గౌడ్, ప్రణీల్, పెద్ది వెంకటేశ్, శివకుమార్ ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

