ఇండ్ల స్థలాలు ఉన్న పేదలు గూడు నిర్మించుకునేలా ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు ఎగబడు తున్నారు. ఇంటి నిర్మాణం కోసం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 2,30,521 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ కార్యాలయాలు సందడిగా మారాయి. ఎంపికైనా లబ్ధిదారులకు వారి ఖాతాల్లో మూడు విడుతల్లో నిధులను అధికారులు జమ చేయనున్నారు.
– గద్వాల, ఆగస్టు 11
గద్వాల, ఆగస్టు11: గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి. సమయం మూడు రోజులే ఉన్నప్పటికీ ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవడంతో చివరి రోజు దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేయడంతో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తులు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3వేల యూనిట్లు కేటాయించగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూర్ జిల్లాను పర్యటించిన సమయంలో తనను ఎంపీగా గెలిపించిన జిల్లాపై ప్రత్యేక మమకారంతో ఉమ్మడి పాలమూర్ జిల్లాకు ఒక్కో నియోజకవర్గంలో 4వేల యూనిట్లు మంజూరు చేసి పాలమూర్పై ఉన్న తన ప్రేమను ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ల ద్వారా ఉమ్మడి పాలమూర్ జిల్లాలో మొదటి విడుత 48వేల మంది నిరుపేదలకు మేలు చేకూరనుంది. గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడుతల్లో వారిఖాతాల్లో అధికారులు నిధులు జమ చేయనున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మరోసారి గృహలక్ష్మి పథకం ద్వారా గూడులేని నిరుపేదలకు గూడు కల్పించడానికి పూను కోవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తుల వెల్లువ
మూడు రోజుల్లో గృహలక్ష్మి పథకం కోసం జిల్లాలో లబ్ధిదారులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం నాటికి జిల్లాలో గృహలక్ష్మి కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్జిల్లాలో 58వేలు, నాగర్కర్నూల్జిల్లాలో 50,252 మంది, జోగుళాంబ గద్వాల జిల్లాలో 23,435 మంది, వనపర్తి జిల్లాలో 66,192మంది, నారాయణపేట జిల్లాలో 32642 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 2,30,521 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఎక్కువ దరఖాస్తులు వనపర్తి జిల్లాలో చేసుకోగా తక్కువ దరఖాస్తులు జోగుళాంబ గద్వాల జిల్లాలో చేసుకున్నారు.
అర్హత కలిగిన ప్రతివ్యక్తికి ‘గృహలక్ష్మి’
ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన ప్రతివ్యక్తికి గృహలక్ష్మి పథకం వర్తించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేసిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 25వ తేదీనుంచి లబ్ధిదారుల ఎంపి క ప్రక్రియ ప్రారంభంకానుంది. మధ్యవర్తుల ప్రమే యం లేకుండా నేరుగా లబ్ధిదారులకు న్యాయం చేయాలనే లక్ష్యం తో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఆర్సీసీ ఇళ్లు ఉన్నవారు మినహాయిస్తే ఇళ్లులేని నిరుపేదలు సొంత స్థలం ఉన్న వారందరినీ ప్రభుత్వం అర్హులుగా గుర్తించే అవకాశంఉంది.