ఉప్పునుంతల : పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని బీఆర్ఎస్(BRS) అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy ) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన ఉప్పునుంతల మండల పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఎరువుల కోసం అరిగోస పడుతున్న రైతాంగం పట్ల కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుదని విమర్శించారు.
పాలనను గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి విహార యాత్రలు చేస్తూ, గాలి మోటార్లలో నోట్ల మూటలు మోస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజలకు వివరిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు తులసీరాం, ఎడ్ల నర్సింహా గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు, నాయకులు కట్టా గోపాల్ రెడ్డి, బాలు నాయక్, శోభన్ రెడ్డి, శంభు భాస్కర్, వెంకటయ్య, మల్లయ్య, కృష్ణయ్య, సవేందర్ సింగ్, సంతోష్ రెడ్డి, లింగమయ్య, ఖాజా, సుల్తాన్, అడ్వకేట్ గుజ్జ సతీష్ రెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణయ్య, భగవంత్, ఎల్లయ్య యాదవ్, చిన్న జంగయ్య, బాలస్వామి, సోషల్ మీడియా ఇన్చార్జి పిల్లి బాలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.