Municipal Elections | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొందపెట్టాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Municipal Elections | రాష్ట్ర ప్రజానికానికి హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూలు : రాష్ట్ర ప్రజానికానికి హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ( Municipal Elections ) బొందపెట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy) పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 13, 12 వార్డులలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో జరిగిన అభివృద్ధి, రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగర్ కర్నూల్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్న మోసాలను బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల పార్టీ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

