గద్వాల, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల, నెట్టెంపాడ్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పా లమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉండగా.. ఇటు జో గుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సాగునీరు అందించడంతోపాటు మిషన్ భగీరథ పథకానికి సైతం ఈ జలాశయం నుంచే నీళ్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మన ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లడంతో ఇటు నడిగడ్డ ప్రజలతోపాటు ఉమ్మడి జిల్లా వా సులకు సాగు, తాగునీటి కష్టాలు ఎదురుకానున్నాయి. మన ప్రాంతానికి చెందిన నేత రేవంత్ సీఎం కావడంతో కష్టాలు తీరుతాయని భావించిన ఉమ్మడి జిల్లా ప్రజలకు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను దాసోహం చేయడంతో రాజకీయ స్వార్థం కోసం ఈ పనిచేశారని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాటుతో జూరాల రైతుల పరిస్థితి అయోమయంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జూరాల బ్యాక్ వాటర్ ద్వారా నెట్టెంపాడ్ లిఫ్ట్‌నకు నీటిని తరలించి అక్కడ నుంచి ర్యాలంపాడ్ రిజర్వాయర్‌ను నింపుతారు. దీని ద్వారా 8 మండలాల్లో 104 చె రువులు నింపడంతోపాటు 141 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు కింద గతంలో కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేవా రు. 2014లో రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేశారు. జూరాలకు వరద వచ్చిన సమయంలో నీటిని తోడి పోసుకొని ప్రస్తుతం 1.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. దీని పరిధి లో 99,100 ప్యాకేజీల పనులు చివరి దశకు పూర్తయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తు తం కాంగ్రెస్ ప్రభుత్వం కృషా ్ణజలాలను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో నెట్టెంపాడ్ లిఫ్ట్ మూత పడే అవకాశం లేకపోలేదు. దాని కింద ఆయకట్టు ప్రశ్నార్థకం కానున్నది. నీటిని తీసుకునేందుకు అనుమతి తప్పనిసరి కానుండడంతో నెట్టెంపాడ్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం పచ్చని పైర్లతో కళకళలాడే భూములు ఇక నెర్రెలిచ్చి బీడు భూములుగా మారే అవకాశం లేకపోలేదు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద వచ్చి చేరుతున్నది. అయితే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల ప్రాజెక్టు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైం ది. ఎగువన వరదలు వచ్చినప్పుడు దిగువకు నీరు విడుదలయ్యేది. ఇక్కడికి వచ్చి న నీటిని జూరాలలో స్టోరేజీతోపాటు బ్యా క్వాటర్ నుంచి నెట్టెంపాడ్ ఎత్తిపోతలకు తరలించేవారు. కానీ ఇక ఆ పరిస్థితికి అ వకాశమే లేదు. వచ్చే ప్రతి నీటి చుక్కకు లెక్క చూపాల్సి రావడంతో నీటిపై హక్కు ను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇ ప్పటికే జూరాల ప్రాజెక్టులో పూడిక నిండిపోవడంతో ప్రస్తుతం 6 నుంచి 7 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకొనే అవకాశం ఉన్నది. ఎగువ నుంచి నీరు రాకపోతే జూరాల ప్రాజెక్టు ఎండిపోయే ప్ర మాదం ఉన్నది. ఈ డ్యాంపై ఆధారపడిన ఆయకట్టుతోపాటు వరద సమయంలో నికర జలాలను వినియోగించుకొనే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీని పరిధిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టు కింద కుడి కాల్వ ద్వారా జోగుళాంబ గద్వాల జిల్లాలో 35,657 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాల్వ కింద 69,084 ఎకరాల ఆయకట్టు (వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో)సాగులోకి 2005 సంవత్సరం నుంచి వచ్చింది. ప్ర స్తుతం జూరాలలో నీటి లభ్యత లేని కారణంగా యాసంగి పంటలకు విరామం ఇచ్చారు.
ఎడారిలా ఉన్న గట్టు ప్రాంతానికి సాగునీరు అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గ ట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించింది. గట్టు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి నీరు ఇచ్చేలా ఈ పథకం రూపొందించారు. రాయపురం వద్ద 1.3 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడ నుంచి గట్టు మండల రైతుల పంట పొలాలకు నీరు అందించడానికి ఏర్పాటు చేశారు. అయితే జూరాల ప్రాజెక్టు మీద నిర్మించిన ప్రాజెక్టులన్నీ వరద, నికర జలాల మీద ఆధారపడి ఉండడంతో వీటి కింద ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనున్నది. నెట్టెంపాడ్ లిఫ్ట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినా 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పచ్చబడేలా చేసింది. దీంతో నడిగడ్డ ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి తీరుతో నడిగడ్డ మళ్లీ ఎడారిగా మారే అవకాశం ఉన్నది. ఇక్కడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం కృష్ణానది నీటిలో రాష్ర్టానికి న్యాయమైన నీటి వాటా సాధించే దిశగా ప్రయ త్నం చేయడం, తెలంగాణలోని భూములకు సాగునీరు అందించకుండా నదుల అనుసంధానాన్ని అంగీకరించకూడదనే భావనతోపాటు కృష్ణాజలాల నిర్వహణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.
కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభు త్వం కేంద్ర జలవనరుల శాఖ కు అప్పగించడంతో ఉమ్మ డి పాలమూరు జిల్లాకు అతి పెద్ద కష్టం వచ్చిం ది. ప్రస్తుతం ఉన్న జూ రాల జలాశయం కింద అతి తక్కువ ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తాం.. ఏపీలో కాంగ్రెస్ ను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చబోతున్నాడు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణాజలాల వినియోగాన్ని పెద్ద ఎత్తున పెంచింది. అసంపూర్తిగా ఉన్న నెట్టెంపాడ్, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, కోయిల్‌సాగర్ పథకాలను పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించింది. కాంగ్రెస్ నిర్ణయంతో ఈ ఎ త్తిపోతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారబోతున్నది. ఉ మ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగింది.