కోడేరు, జూన్ 21 : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన నీలి విప్లవంపై ప్రభుత్వం విధానాలు, నిర్ల క్ష్యం, నిధుల కొరత కారణంగా నీలినీడలు కమ్ముకున్నా యి. టెండర్ల ప్రక్రియ జాప్యం, సరైన సమయంలో చేపపిల్లలు పంపిణీ చేయకపోవడం వల్ల మత్స్యకారుల ఉ పాధికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. వానకాలం ప్రారంభమైనా జిల్లాలోని చెరువులు కుంటల్లో ఈఏడాది చేపపిల్లలను వదిలే ఆలోచన ప్రభుత్వానికి రావడం లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఆ లస్యం చేస్తే చేపల ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్ప ష్టత లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మత్స్యకారులు కుటుంబాలను ఆదుకోవడంతో పా టు చేపల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై జిల్లాలో నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం కంటే ముందే పంపిణీ కోసం ప్రభు త్వం టెండర్లను ఆహ్వానించేది. ఈఏడాది ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ ఊసెత్తకపోవడంతో ఈసారి ప్రభు త్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం నీటి వనరులు ఉన్న చెరువులు కుంటలు 1056 ఉన్నాయి. వీటి విస్తీ ర్ణం 25814 హెక్టార్ల వరకు ఉంటుంది. 235 మత్స్య సహకార సంఘాల్లో 17900మంది మత్స్యకారులు ఉ న్నారు. సుమారు 20వేల మంది చేపలు పట్టడం వాటి ని విక్రయించడం ద్వారా మత్స్యకార వృత్తిపై ఆధారప డి ఉపాధి పొందుతున్నారు. 2016-17లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. గతేడాది చెరువులు కుంటల్లో 2.2కోట్ల చేప పిల్లలను వదలగా ఈఏడాది ఇప్పటి వరకు అసలు టెం డర్లనే ప్రభుత్వం పిలువలేదు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో చేప పిల్లలను వదలకపోవడంతో తాము అన్ని రకాలుగా నష్ట పోతున్నామని, ప్రభుత్వం తమపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నదని వారు మండి పడుతున్నారు.

ఆలస్యం చేస్తే నష్టం
వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటల్లోకి నీ రు చేరే సమయానికి ఉచిత చేప పిల్లలను విడుదల చేసే అవకాశం ఉందో లేదో అన్నది అనుమానంగా ఉంది. నేటికీ చేప పిల్లల టెండర్ ప్రక్రియ మొదలు కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆలస్యం చేస్తే చేపలు ఎదగడం కష్టంగా మారుతుందని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే టెం డర్ ప్రక్రియను పూర్తి చేసి చేపపిల్లలను వదిలేలా చర్య లు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
పంపిణీపై అనుమానాలు
చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా జి ల్లాల వారీగా టెండర్లును నిర్వహిస్తోంది. టెండర్ దక్కించుకున్న షిప్ సీడ్ ఫార్మర్లు చేప పిల్లలను ఉచితంగా చె రువులు కుంటల్లో వదలాల్సి ఉంటుంది. తరువాత ప్ర భుత్వం వారికి డబ్బులు చెల్లిస్తుంది. ఈసారి జూలై నెల దగ్గర పడుతున్నా టెండర్లు పెండింగ్ బిల్లులకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అ మలు పై సందేహాలు వ్యక్తమవుతున్నారు. గతేడాది చేపపిల్లల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నా యి. బోగస్ లబ్ధిదారులతో కుమ్మక్కై అధికారులు నిధు లు స్వాహా చేసినట్లు మత్స్యకారులు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈసారి చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
ఆదేశాలు వచ్చిన వెంటనే పంపిణీ
చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుం చి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. వచ్చిన వెం టనే చర్యలు తీసుకుం టాం. అందుకే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కా లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చేప పిల్లలను వదులుతాం.
– నర్సింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి