పెద్ది కుటుంబానికి పరామర్శల వెల్లువ
ఇటీవల గుండెపోటుతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
- దివంగత నేత చిత్రపటానికి బీఆర్ఎస్ నివాళి
నల్లబెల్లి, ఆగస్టు 2 : ఇటీవల గుండెపోటుతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివస్తూ పెద్ది చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ అధినేతతో ఉన్న సంబంధాలు, ఆయన చేసిన అభివృద్ధి పనులు, కష్టకాలంలో కార్యకర్తలను ఆదుకున్న పరిస్థితులను నెమరు వేసుకుంటున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్త్తూ అన్న లేకున్నా కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న అభిమానం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. అన్న చూపిన బాటలో పయనిస్తూ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామంటూ ప్రతిన బూనుతున్నారు. నర్సంపేట నియోజకవర్గానికి ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ అధికారులతో మమేకమైన తీరు, ఆయన ఉద్యోగులకు ఇచ్చిన గౌరవాన్ని బదిలీపై వెళ్లిన వారు అలాగే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

