హైదరాబాద్, ఆగస్టు 2, (నమస్తే తెలంగాణ) : మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి త్యాగాలు అజరామరం అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ ఆటా మహాసభల్లో ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఆదివారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమంలో తీవ్ర గాయాలపాలైనా లెకచేయకుండా చివరి వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పెద్ది నిరంతరం శ్రమించాడని గుర్తుచేసుకున్నారు. అలాంటి మహనీయుడిని కోల్పోవడం తెలంగాణ సమాజానికి, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సంతాప సభకు ప్రవాస భారతీయులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది తమ ప్రియతమ నాయకుడు పెద్దిని స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఇన్చార్జి మహేశ్ తన్నీరు మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలకు గుర్తింపుగా తెలంగాణ తాగు, సాగునీటి రంగంలో కీలకమైన దేవాదుల ప్రాజెక్టుతోపాటు నర్సంపేటలో ఏర్పాటుకానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఐలు తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, చందు తాళ్ల, నరసింహ నాగులవంచ, రజినీకాంత్ కొసనం పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, పుట్ట మధు, సీనియర్ నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం హర్షణీయం
తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వచ్చి ఉన్నత స్థానాలకు ఎదిగిన ప్రతిఒకరూ నేడు దేశాభివృద్ధిలో భాగస్వాములవడం హర్షణీయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన ఆటా మహాసభల్లో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. విదేశాల్లోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభ చాటుతూ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. అమెరికాలోని నగరాలతో పోలిస్తే బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అంతకంటే గొప్పగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వ విధానాలు, వీసాల రద్దు వంటి విషయాలపై వస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ ప్రవాస తెలంగాణ యువత ఎలాంటి భయాలకు గురికావద్దని, హైదరాబాద్ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తుందని భరోసా ఇచ్చారు.
‘తెలంగాణ చరిత్రలో మైలురాళ్లు’ పుస్తకావిషరణ
ఆటా 19వ వార్షిక సాహితీ సమావేశాల వేదికగా ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్రలో మైలురాళ్లు’ పుస్తకాన్ని ఆటా లిటరరీ విభాగం అధ్యక్షుడు వేణు నక్షత్రం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఆవిషరించారు. ఈ సందర్భంగా వేణు నక్షత్రం మాట్లాడుతూ.. తెలంగాణలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిగిన పురావస్తు పరిశోధనల్లో వెలుగుచూసిన ఎన్నో అరుదైన విషయాలను శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు తెలిపారు. ఆటా ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా అధ్యక్షుడిగా ఎన్నికైన సతీశ్‌రెడ్డి రామసహాయం, కన్వీనర్ శ్రీధర్ బానాల తదితరులు శివనాగిరెడ్డిని అభినందించి సతరించారు. కార్యక్రమంలో సూర్య నాంపల్లి, రాజేశ్వర్‌రావు టెక్మాల్, ప్రకాశ్ తిమ్మాపురం, వెంకటకృష్ణారెడ్డి గుజ్జుల, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.