హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : 22ఏ భూముల అంశానికి కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టంచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ యన గురువారం ఏఐసీసీ పెద్దలతో భేటీకి ముందు మీడియాతో మాట్లాడారు. 22-ఏ విషయంలో అధికారుల స్థాయిలో తప్పిదాలు జరిగి ఉండొచ్చని, వాటిపైనా విచారణ జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షీనటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు.
నామినేటెడ్ పోస్టులను నెల రో జుల్లో భర్తీ చేస్తామని వెల్లడించిన ఆయన.. మంత్రివర్గ విస్తరణ నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డిదేనని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా త్వరలో చేపడుతామని మహేశ్‌కుమార్ స్పష్టంచేశారు. పార్టీలో కొండా సురేఖ అంశం ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు.