పా రంజిత్ సరికొత్త ప్రయోగం
సామాజికాంశాలను తెరపై ఆవిష్కరించడంతో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ దర్శకుడు పా.రంజిత్. ఆయన తాజా చిత్రం ‘వెట్టువమ్'లో ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. బుధవారం ఈ పాన్ ఇండియా సినిమా తాలూకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
సామాజికాంశాలను తెరపై ఆవిష్కరించడంతో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ దర్శకుడు పా.రంజిత్. ఆయన తాజా చిత్రం ‘వెట్టువమ్’లో ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. బుధవారం ఈ పాన్ ఇండియా సినిమా తాలూకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయ క్రీడ మల్లఖంబం నేపథ్యంలో ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు.
నిలువుగా ఏర్పాటు చేసిన కర్రపై జిమ్నాస్టిక్స్ తరహాలో విన్యాసాలను ప్రదర్శించడం ఈ క్రీడ ప్రత్యేకత. ఇప్పటివరకు ఏ కమర్షియల్ సినిమాలో కనిపించని సంప్రదాయ మల్లఖంబం క్రీడను కథలో భాగంగా చూపించడం ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ క్రీడను కేవలం యాక్షన్ ఘట్టాల కోసమే ఉపయోగించారా? లేక సినిమా కథతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో కలై అరసన్, మైమ్ గోపి, శోభితా ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

