‘కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే తెలంగాణ క్యాబ్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. క్యాబ్ డ్రైవర్ల కష్టాలు తమకు తెలుసునని వారికోసం ప్రభుత్వమే యాప్ తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. మూడేండ్లు గడిచినా డ్రైవర్ల సంక్షేమంపై సీఎం ఎలాంటి ఆలోచన చేయడం లేదని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే యాప్ తీసుకొచ్చి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.’
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 ( నమస్తే తెలంగాణ )
ఏడు రోజులుగా బంద్‌లో పాల్గొంటున్నారు 35వేల మంది క్యాబ్ డ్రైవర్లు. తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ ట్రిప్పులు రద్దు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేర్ చార్జీలు పెంచడంతో పాటు ఓవర్ స్టే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దూరం ప్రాతిపాదికన ధరలు ఉండాలని.. వాహన ధర ప్రకారం రైడ్ ధరలు నిర్ణయించాలంటున్నారు. ఇతర రాష్ట్ర వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో ట్రిప్పులు చేస్తున్నాయని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ.. రవాణా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేదంటున్నారు. ఎయిర్పోర్ట్ బైకాట్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుందంటున్నారు.
తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఎయిర్పోర్ట్ బైకాట్ నిరసన ప్రభావం దేశ, విదేశీ ప్రయాణికులకు తాకింది. విమానాశ్రయం వద్ద క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవడంతో వాళ్లంతా వాహనాల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. 7 రోజులుగా 35వేల మంది డ్రైవర్లు బంద్‌లో పాల్గొని ఫేర్ ఛార్జీలు పెంచడంతో పాటు ఓవర్ స్టే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో బుకింగ్ ట్రిప్స్ తీసుకోవడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ ట్రిప్పులు రద్దు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దూరం ప్రాతిపాదికన ధరలు ఉండాలని.. వాహన ధర ప్రకారం రైడ్ ధరలు నిర్ణయించాలని డ్రైవర్లు చెప్పారు.
ఇతర రాష్ట్ర వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో ట్రిప్పులు చేస్తున్నాయని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. ఎయిర్పోర్ట్ బైకాట్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఆర్టీసీ సైతం ఎయిర్‌పోర్ట్‌కు సరిపడా బస్సులు సమకూర్చడంలో విఫలమవుతున్నది.
ఈ పరిస్థితిని కొందరు రెంటల్ కార్ల నిర్వాహకులు ప్రయాణికుల దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. యాప్‌లో ఓ రైడ్‌కు 700 చూపిస్తే.. అదే దూరం ప్రయాణానికి రెంటల్ కార్కు రూ.25 వందలు ఛార్జీ చేశారని నరేష్ అనే ప్రయాణికుడు తెలిపాడు. ఎయిర్పోర్ట్ వద్ద క్యాబ్ సేవలు చాలా కీలకమని ప్రభుత్వం స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిస్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల అమలు చేసిన 8 నిమిషాల ఉచిత డ్రాప్-ఆఫ్ పరిమితి, ఓవర్ స్టే చార్జీల విధానాన్ని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) తీవ్రంగా ఖండించింది. ఎయిర్ పోర్ట్ ర్యాంపుల వద్ద రోజూ ఎదురయ్యే భారీ ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల లగేజీ నిర్వహణలో ఆలస్యం, వృద్ధులు, దివ్యాంగ ప్రయాణికులకు సహాయం చేయాల్సిన అవసరం, నెట్ వర్, చెల్లింపు సమస్యలు వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ విధానం అమలు చేయడం డ్రైవర్లకు తీవ్ర అన్యాయమని యూనియన్ పేరొంది. ప్రస్తుతం 8 నిమిషాలకు మించి ర్యాంపుల వద్ద ఉన్న వాహనాలపై 250 నుంచి రూ.500 వరకు చార్జీలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్లపై ఇది అదనపు ఆర్థిక భారం మోపడేమనని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల పెరిగాయని, ఎయిర్పోర్ట్ ట్రిప్‌లలో తకువ ఆదాయం, ప్లాట్ ఫామ్ కంపెనీలు ఇటీవల కాలంలో చార్జీలు పెంచకపోవడం, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులతో ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాఫిక్ నిర్వహణ లోపాలు, ఆపరేషనల్ సమస్యల వల్ల కలిగే ఆలస్యాలకు డ్రైవర్లను బాధ్యులుగా చేసి జరిమానాలు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఎయిర్ పోర్ట్ ర్యాంపుల వద్ద కనీసం 10-15 నిమిషాల ఉచిత డ్రాప్-ఆఫ్ సమయం కల్పించాలని కోరారు.