మైనర్పై అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై హత్య చేసిన దారుణం బాలానగర్ మండలం కేస్లీనాయక్ తండాలో చోటు చేసుకున్నది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వరుసకు బాబాయి, అతడి స్నేహితులు లైంగికదాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహంతో మైనర్ కుటుంబ సభ్యులు అనుమానితులకు చెందిన కారుకు నిప్పు పెట్టి దుకాణాన్ని ధ్వంసం చేశారు. జడ్చర్లలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్పీ, ఆర్డీవో హామీతో విరమించారు.
రాజాపూర్, డిసెంబర్ 3 : మానవ మృగాల కామకాంక్షకు బాలిక బలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి పంచాయతీ పరిధిలోని కేస్లీనాయక్ తండాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. తండాకు చెందిన హన్మంతునాయక్ భార్యా పిల్లలతో కలిసి హైదరాబాద్లో శుభకార్యానికి వెళ్లాడు. అతడి చిన్న కూతురు (16) పదో తరగతి చదువుతున్న బాలిక ఇంటి వద్దే ఉండి స్కూల్కు వె ళ్లింది.
ఇదే అదునుగా భావించిన ముగ్గురు వ్యక్తులు శు క్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడి సామూహిక లైంగికదాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు తెలిసింది. ఆ త ర్వాత హైదరాబాద్కు పరారయ్యేందుకు క్యాబ్ బుక్ చే సుకున్నట్లు సమాచారం. తెల్లవారుజామున స్థానికులు గమనించి తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేశా రు. ఘటనకు కారణమైన వ్యక్తి బాలికకు వరుసకు బా బాయి, అతడితోపాటు చిన్నరేవల్లి, తిర్మలగిరికి చెందిన యువకులు ఉన్నారని అనుమానించారు.
దీంతో రెండు గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో బాలిక బంధువులు అనుమానిస్తున్న యువకుల ఇండ్లను, చిన్నరేవల్లిలో టీవీ రిపేర్ షాపును ధ్వంసం చేశారు. కారును దహనం చేశారు. హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాల ని రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న సీఐ జములప్ప, బాలానగర్ ఎస్సై జయప్రసాద్ ఘట నా స్థలానికి చేరుకొని బాలిక బంధువులు, గ్రామస్తుల తో మాట్లాడారు. నిందితులను అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తామని నచ్చజెప్పడంతో శాంతించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల దవాఖానకు తరలించారు.
బాలిక హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల దవాఖానకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి అమానవీయ ఘటన జరగడం బాధాకరమన్నారు. బాలిక మృతికి కారణమైన నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.