Nagarkurnool | బిజినేపల్లి, జూన్ 09 : పాఠశాలలకు ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉన్నత పాఠశాలలకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని ఇంచార్జి ఎంఈఓ రఘునందన్ శర్మ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనం వద్ద పలు పాఠశాలలకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలను, నోట్ బుక్స్‌ను విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు. స్కూల్ ప్రారంభం కాక ముందే పుస్తకాలు పాఠశాలకు వచ్చాయని అన్నారు. బడి బయటి పిల్లల్ని బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఆర్సీలు మల్లేష్, సాంబశివ, రామస్వామి, శేఖర్, తిరుపతి, ప్రభాకర్, బాలయ్య తదితరులు ఉన్నారు.