వైభవంగా రథోత్సవం
మండల కేంద్రంలో ని ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆఖండ భజనలు, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథాన్ని భక్తులు పట్టణంలోని పురవీధుల గుండా లాగారు.
- పలు గ్రామాల్లో కనులపండువగా రథోత్సవాలు
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
దేవరకద్ర, డిసెంబర్ 26 : మండల కేంద్రంలో ని ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆఖండ భజనలు, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథాన్ని భక్తులు పట్టణంలోని పురవీధుల గుండా లాగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తంగిడిలో ఆంజనేయస్వామి..
కృష్ణ, డిసెంబర్ 26 : మండలంలోని తంగిడిలో వెలిసిన ఆంజనేయ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సా యంత్రం పుష్పాలు, అభరణాలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శనభా గ్యం కల్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య స్వామివారు రథంపై పురవీధుల్లో ఊరేగారు. జై శ్రీరా మ్ నినాదాలతో ఈలయ ప్రాంగాణం మార్మోగిం ది. వేదపండితుల మం త్రోచ్ఛరణలు, మేళతాళా లు, మంగళవాయాద్యా ల మధ్య భక్తజన సందోహంగా మారింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై స్వామివారికి పూజలు నిర్వహి ంచారు. పీఠాధిపతులతో మహాద్వార ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మద్దిగట్లలో..
భూత్పూర్, డిసెంబర్ 26 : మండలంలోని మద్దిగట్లలో బత్తిని కాంత్‌రెడ్డి తన భార్య సుకన్యాదేవి స్మారకార్థం నిర్మించిన శ్రీపెద్దమ్మతల్లి ఆలయ ప్రారంభోత్సవ పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి, శివాలయం, చెన్నకేశవస్వామి, బ్రహ్మంగారు, బీరప్ప, మల్ల య్య, కోటమైసమ్మ, ఈదమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కాంతారెడ్డి తెలిపారు. ఈనెల 27, 28, 29వ తేదీల్లో వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.
ఘనంగా లింగమయ్య జాతర
మక్తల్, డిసెంబర్ 26 : మక్తల్ మండలం రుద్రసముద్రంలో మంగళవారం లింగమయ్య జాతర వైభవంగా నిర్వహించారు. గ్రామ శివారులో వెలిసిన లింగమయ్య స్వామిని స్థానిక ఎమ్మెల్యే వాకి టి శ్రీహరి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు, పోతరాజులు సం ప్రదాయబద్ధంగా స్వామివారిని గ్రామ వీధుల్లో డోలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా ఆల యం వరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వివి ధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ‘బండారు’ వేసుకుని స్వామివారికి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
లక్ష్మీనర్సింహ ఆలయంలో పూజలు
పాలమూరు, డిసెంబర్ 26 : జిల్లా కేంద్రంలోని సింహగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మం గళవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మార్గశిర మాసపౌర్ణమి సందర్భంగా అభిషేకం, ప్రత్యేక అలంకరణ, కళశాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.
భక్తిశ్రద్ధలతో అంజన్న ఉత్సవాలు
ఊటూర్, డిసెంబర్ 26 : మండలంలోని బిజ్వారంలో వ్యాసరాయల మహర్షిచే ప్రతిష్ఠించిన పడమటి అంజన్న ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారికి ఆలయ పూజారి నర్సింహచారి జోషి అభిషేకం, పుష్పాలంకరణ, ఆకుపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో స భ్యులు మహేశ్‌గౌడ్, గోవింద్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్యగౌడ్, అరుణ, శేఖర్, రాజప్ప, రామాంజనేయులు, కృష్ణయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

