దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), డిసెంబర్ 7 : భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టిన సం ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కౌకుంట్ల మం డలం దాసర్పల్లి గ్రామంలో శనివారం మధ్యా హ్నం 12:15 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది.
ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు భయంతో ఇండ్ల నుంచి కొందరు బయటకు రాగా.. మరికొందరు ఏం జరుగుతుం దో తెలుసుకునేలోగా అంతా ముగిసింది. దీంతో ఇండ్లల్లోని వస్తువులు కిందపడ్డాయి. వంట గిన్నె లు కదిలి చెల్లాచెదురుగా పడ్డాయి. దీని తీవ్రత రిక్ట ర్ స్కేలుపై 3.0గా నమోదైంది. కొద్దిపాటిగా భూ కంపం రావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా మూడ్రోజుల కిందట ములుగు జిల్లాలో కూ డా భూకంపం సంభవించింది.