వనపర్తి, జూలై 11 : స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, పట్టణాలకు చెందిన 187 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ.51లక్షల 90వేల విలువ గల చెక్కులను మం త్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందుతుందని, అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, రైతులు, గర్భిణులు, బా లింతలు, శిశువులు, విద్యార్థులు, కిశోర బాలికలు ప్రతిఒక్కరికీ ప్రభుత్వం చేయూతను అందిస్తున్నట్లు వివరించారు. దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నాయని అర్హులందరికీ న్యాయం చేస్తామని, సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకంను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి అ ల్పాహారం చేశారు. అంతకుముందు గడిచిన 9ఏండ్ల కా లంలో జిల్లా కేంద్రం లో జరిగిన ప్రతి అభివృద్ధిపై తీసిన డాక్యుమెంటరీని లబ్ధిదారులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి, జూలై 11 : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి స్వచ్ఛదంగా చేరుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రికుంట హనుమాన్ ఆటో యూనియన్ నుంచి 40 మంది మార్కెట్ డైరెక్టర్ చీర్ల శ్రీనివాసులు ఆధ్వర్యం లో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆటో యూనియన్ అధ్యక్షుడు స్వామి, ఉపాధ్యక్షుడు అన్వర్‌పాషా, ప్రధా న కార్యదర్శి రాజు, కోశాధికారి మహేశ్‌తోపాటు 40 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.