నవాబ్‌పేట, జూన్ 27 : మండలంలోని లోకిరేవు గ్రామంలో బీఆర్ఎస్ సర్కారులో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగ ణం కబ్జాకు గురైంది. అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు భూమిని చదును చేసి శుక్రవారం మొక్కజొన్న విత్తనాలు వేయడంతో విషయం బయట పడింది. ఎంతో వ్యయప్రయాసలతో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం కబ్జాకు గురి కా వడంతో గ్రామస్తులు ఒక్కసారిగా నివ్వెర పోయారు.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో గ్రామానికో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలనే ల క్ష్యంతో.. లోకిరేవులో సైతం క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 239లో గల సీలింగ్ పొలంలో అప్పటి అధికారు లు, పాలకులు ఎకరా పొలంలో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుతం క్రీడాప్రాంగణం ఏర్పాటు చేసిన పక్కనే అదే గ్రామానికి చెందిన కొంత మంది నిరుపేద రైతులకు ప్రభు త్వం భూమిని పంపిణీ చేసింది.
మిగిలిన భూమిలో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల కురిసిన వర్షానికి క్రీడాప్రాంగణం పక్క భూమి రైతులు.. ఈ భూమి కూడా తమదే నంటూ దర్జాగా చదును చేసి మొక్కజొన్న విత్తనాలు సాగు చేశా రు. ఈ విషయమై ఎంపీడీవో జయరాంనాయక్‌ను వివరణ కో రగా…క్రీడాప్రాంగణంలో కొంతమంది వ్యక్తుల విత్తనాలు వేసి న విషయం వాస్తవమేనని తెలిపారు. వెంటనే సర్వే చేపట్టాలని తాసీల్దార్ శ్రీనివాస్‌ను కోరామని చెప్పారు. సర్వే చేపట్టి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.