వనపర్తి, జనవరి 6: స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేర్ రహదారిలో రూ.3కోట్లతో నిర్మిస్తున్న వే సైడ్ మార్కెట్, మర్రికుంట వద్ద కాల్వ పనులను మంత్రి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మాదిరి వ్యవసాయ పథకాలు దేశమంతా అమలు కావాలన్న డిమాండ్ పెరుగుతున్నదని, తెలంగాణ మాదిరిగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు ఇస్తే దేశం ప్రపంచానికే ఆదర్శమవుతుందని మంత్రి వివరించారు.
పంజాబ్ మినహా కేంద్రం ఎక్కడా కొనుగోళ్లను చేయడం లేదని, దేశంలో రైతులు పంటలు అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నట్లు జాతీయ రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి గుర్తు చేశారు. కూలి పని లేక ఒకనాడు ఖాళీగా ఉన్న పరిస్థితి నేడు కూలీలు దొరకని విధంగా మారిందన్నారు. ఓపిక ఉండి కష్టం చేసుకునే వారికి గ్రామాల్లో చేతినిండా పని దొరుకుతున్నదన్నారు. రైతులు బాగుంటే గ్రామాలు బాగుంటాయని, అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధా న్యం ఇస్తున్నారని, రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో ఊహించని అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు విభూ తి నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
పెబ్బేర్ మండలంలోని సూగూరు గ్రామంలోని తాపీ మేస్త్రీ సంఘానికి చెందిన 50మంది శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్బూల్, పరశురాం ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ముందుగా మంత్రి నిరంజన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఏ గ్రామానికి ఏం పనులు కావాలో తన దృష్టికి తీసుకురావాలన్నారు. సూగూరు చెరువును సుందరం గా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, రాధాకృష్ణ, కట్టా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు విడుదలైన చెక్కులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అందజేశారు. రేవల్లి మండలం గౌరిదేవిపల్లికి చెం దిన పార్వతమ్మకు రూ 2లక్షలు, గోపాల్పేట మండలం జంప్లా తండాకు చెందిన ప్రవీణ్‌కు రూ.17,500 విలువ గల చెక్కులను అందజేశారు.