తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యుద్దీపాల కాంతుల్లో అందంగా ముస్తాబు చేసిన ఐడీవోసీ, ఎస్పీ, పోలీస్ పరేడ్గ్రౌండ్ల వద్ద కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు జెండాలను ఎగురవేశారు. అమరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వివిధ పార్టీల కార్యాలయాల వద్ద జరిగిన కార్యక్రమాల్లో నాయకులు పాల్గొన్నారు.