ఊట్కూర్ : అర్హత ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పదోన్నతులు (Promotions Demand) కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంతో పాటు మొగ్దుంపూర్, బిజ్వార్, పులిమామిడి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం గ్రామాలలో తపస్ మెంబర్షిప్ అభియాన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలసై తపస్ అలుపెరుగని పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి ఉపాధ్యాయుడికి ప్రమోషన్స్ కల్పించాలన్నదే ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని సైతం వెంటనే ప్రకటించాలని కోరారు.
కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు మురళీధర్ ,రాములు, విజయలక్ష్మీ, కిరణ్, మండల గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, గోపాల్, నాయకులు వెంకటేష్ గణపతి, బన్నేష్, పారిజాత, రవీందర్ నాయక్ ,సంతోష్ కుమార్, శిరీష, వసుంధర, రమేష్, కృష్ణ, గోపాల్, శివరాజ్, మహేష్, ప్రతిభ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.