అయిజ, జనవరి 30 : పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయురాలు వీపుపై చితకబాది గాయపర్చిన ఘటన చోటు చేసుకున్నది. తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు.. గట్టులో నివాసం ఉం టున్న జ్యోతి (గట్టులోని టీజీఎస్డబ్ల్యూఎస్లో పీడీ), కృష్ణానాయక్ దంపతుల ఇద్దరు కుమారులు విరాట్ శంకర్‌నాయక్, మోక్షిత్ నాయక్ అయిజ ప ట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో విద్యాభ్యా సం చేస్తున్నారు. విరాట్ శంకర్ నాయక్‌ను తరగతి ఉపాధ్యాయురాలు కట్టెతో చితకబాదడంతో వీపుపై గాయమైంది.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రు లు వి ద్యార్థిని చితకబాదిన విషయం హెచ్ఎంతో ఫోన్లో మా ట్లాడగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థులను కొట్టే హక్కు ఉపాధ్యాయులకు లేదని చెప్పినా ఎక్కడైనా చెప్పుకోండని సమాధానం ఇవ్వడంతోనే గురువా రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు జ్యోతి, కృష్ణానాయక్ తెలిపారు. ఇదే విషయమై పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
పా ఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఉపాధ్యాయులు విద్యార్థులను చితకబాదారని, వేలకు వేలు ఫీజులు కట్టి విద్యాబోధన చేయాలని తల్లిదండ్రులు కోరగా, పిల్లలను కట్టెలతో కొట్టడం ఏమిటని ప్ర శ్నించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఎం ఈవో రాములు, హెచ్ఎం మధుసూధన్‌రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేసి, ఉన్నతాధికారులకు పంపుతామని ఎంఈవో చెప్పారు. ఉపాధ్యాయురాలు వి ద్యార్థిని చితకబాదడం తప్పేనని, భవిష్యత్తులో ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హెచ్ఎం తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మే రకు విచారణ చేపడుతామని కానిస్టేబుల్ తెలిపారు.