మహబూబ్నగర్టౌన్, జూలై 20 : పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంవోయూ సంయుక్తంగా తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) నైపుణ్య శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు పీయూ వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన టీ-హబ్ కార్యక్రమంలో తెలంగాణ అకాడమీతో మం త్రి కేటీఆర్ సమక్షంలో పీయూ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు. యువత పారిశ్రామికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకటరమణ, జయేశ్ రంజన్ ఐఏఎస్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ పాల్గొన్నారు.