వనపర్తి, ఏప్రిల్ 17 : ఎన్నికల ప్రక్రియలో రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం మరింత తోడవుతున్న ది. సులువుగా ఇంటి వద్ద నుంచి ఓటు నమోదు చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవడం, ఎన్నికల రిటర్నింగ్ కేంద్రాలకు వెళ్లకుండానే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రత్యేక యాప్‌లను సీఈ సీ సిద్ధం చేసింది.
అభ్యర్థులు నామినేషన్లు వే సేందుకు మద్దతుదారులతో ర్యాలీగా వె ళ్లడం, ప్రత్యేక వాహనాలను ఏర్పా టు చేసుకోవడం వంటివన్నీ అదనపు ఖర్చులే. వీటని తగ్గించేందుకు ప్రత్యేకంగా సువిధ యా ప్ను ఎన్నికల సంఘం అం దుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే suvidha.eci.gov. in అనే వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది.
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రా రంభమై 25వ తేదీన ముగుస్తుంది. కలెక్టరేట్లో జిల్లా ఎ న్నికల అధికా రి, కలెక్టర్లు నామినేషన్లు స్వీకరిస్తారు. నాగర్క ర్నూల్ పార్లమెంట్ గద్వాల నుంచి కల్వకుర్తి వర కు ఉన్నది. ఆయా నియోజకవర్గాల వారు పోటీ చే సినా నామినేషన్లు వేసేందుకు నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు రావాల్సిందే. ఇంతదూరం రావడం కష్టమనిపించే వారు యాప్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయొచ్చు. అయితే, ఎన్నికల కమిషన్ సూచించిన ప త్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల అఫిడవిట్ పత్రాలు, నామినేషన్‌ను బలపర్చేందుకు పది మంది వివరాలు నమోదు చేయాలి.
వీటికి కావాల్సిన పత్రాలు అందజేసిన తర్వాత నిర్ణీత సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ పత్రాలతో జిల్లా ఎన్నికల అధికారిని కలిసి మూడు సెట్లు అం దించాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన, గు ర్తుల కేటాయింపు వంటి వాటికి అభ్యర్థులు అం దుబాటులో లేకుంటే వారి మద్దతుదారులు హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలు త ప్పుగా ఉంటే నామినేషన్‌ను తిరస్కరిస్తారు. ఆన్లైన్ అవకాశాన్ని వినియోగించుకుంటే అభ్యర్థులకు స మయం, డబ్బులు ఆదా అవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.