జోగులాంబ గద్వాల: భూముల సర్వే ( Land Survey ) చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి అధికారికంగా లబ్ధి చేకూర్చేందుకు లంచం ( Bribe ) తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య ( Brahmayya ) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు.
తన భూమిని సర్వే చేయాల్సిందిగా మండల సర్వేయర్ బ్రహ్మయ్యను బాధితుడు ఆశ్రయించగా రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహం మేరకు పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని అధికారులు హెచ్చరించారు.