జోగులాంబ గద్వాల : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందిదని బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Basu Hanumanthu Naidu ) ఆరోపించారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి ( Unseasonal Rains) తడిసి, మొలకెత్తిన ధాన్యాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోయిన వడ్లు పూర్తిగా తడిసి మొలకెత్తాయని, రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని తెలిపారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ, రైతుల జీవితాలతో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రైస్ మిల్, ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటున్నారని వెల్లడించారు. వర్షానికి తడిసి, మొలకెత్తిన వడ్ల రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పటేల్ జనార్దన్ రెడ్డి, శేఖర్ నాయుడు,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,తిమ్మప్ప గౌడ్,రాముడు, పూడూరు రఘు నాయుడు,రమేష్, డ్యామ్ శ్రీను, రాము,వినయ్,తిమ్మప్ప, హరి కృష్ణ, మధు,మోహన్,భాస్కర్, నాగరాజు, కృష్ణ, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.