ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపా టు అనేక గ్రామాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ర హదారులు తెగిపోయాయి.. ఇతర గ్రామాలకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థి తి. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్లు ఎస్పీలు కేవలం సమీక్షలతో సరిపెడుతున్నారు.
బాధితులు వరదల్లో చిక్కుకొని నిరాశ్రయులు అవుతున్నా వారిని పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. రహదారుల మరమ్మతులు, వరద నీటిని మళ్లించడం వంటి చర్యలు కనిపించడం లేదు. ఇక జిల్లా కేంద్రాల్లో అనేక కాలనీలు జలమయమయ్యా యి. దీంతో మున్సిపల్ సిబ్బంది వచ్చి చేయాల్సింది పోయి ఆయా కాలనీవాసులే నీటిని మళ్లించుకుంటున్నారు. ఇండ్లల్లోకి మురుగునీరు చేరి రాత్రి జాగరణ చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.
భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. కొన్నిచోట్ల సబ్ స్టేషన్లలోకి వరద నీరు రావడం, భారీ వర్షాలకు కరెంటు స్తంభాలు విరిగిపోవడం, వైర్లు తెగిపోవడంతో చాలా గ్రా మాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తు న్న వర్షాలకు మరమ్మతులు చేయడానికి కూడా వీలు కావడం లేదు. దీం తో విద్యుత్ అధికారులు గ్రామాలు, పట్టణాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోవడంతో ప్రజలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారు. అప్పంపల్లి సబ్‌స్టేషన్‌ను పునరుద్ధరించారు.