మరికల్ : మహబూబ్‌నగర్ లో కొత్తగా నెలకొల్పిన త్రిబుల్ ఐటీలో ( Triple IT ) మరికల్ మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సీట్లను సాధించారు. ప్రతిభ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన సౌమ్య ( Sowmya ) , అభినవ్ (Abhinav) అనే విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందని ఆ పాఠశాల కరస్పాండెంట్ హనుమంత్ రెడ్డి తెలిపారు.
నారాయణపేట జిల్లాలో అధిక మార్కులు సాధించి మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పలువురు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. జిల్లాలో గత ఏడాది జిల్లా టాపర్‌గా నిలిచిన అభినవ్, సౌమ్యాలు ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించడం తో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు త్రిబుల్ ఐటీ విద్య అందుబాటులోకి వచ్చినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనంద పడుతున్నారు.
గతంలో ట్రిపుల్ ఐటి చదవాలంటే బాసర వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో విద్యార్థులు మరింత ఉన్నత స్థానంలో నిలవాలని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, కరస్పాండెంట్ హనుమంత్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.