మక్తల్, నవంబర్ 27 : మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పా యిజన్ కావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురై బుధవారం ఉదయం స్కూల్‌కు వచ్చే సమయంలో ఇంటినుంచే బాక్స్‌లు తెచ్చుకున్నారు. వాటినే మధ్యా హ్నం భుజించారు.
వారిని ‘నమస్తే తెలంగాణ’ బృందం పలకరించగా.. వారం రోజులుగా ఫుడ్‌పాయిజన్ అవుతుండడంతో అన్నం తినాలంటే భయమవుతుందని ఆ వేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో 590 మందికిగానూ 338 విద్యార్థులు హాజరు కాగా.. చాలా మంది ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్నే తిన్నారు.