గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వి ద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు అరకొర బస్సులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బ స్సు సౌకర్యం కల్పించడంతోపాటు బస్సుల సంఖ్యను తగ్గించడంతో విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు రావడానికి పడరాని పాట్లు ప డుతున్నారు.
ఈ క్రమంలో గురువారం మక్త ల్ నుంచి ముష్టిపల్లికి వెళ్లే బస్సులో తిరుగు ప్రయాణంలో విద్యార్థులు ఇలా ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా వెళ్తుండగా.. ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి తన కెమెరాలో బంధించారు.
– మక్తల్, సెప్టెంబర్ 26