మహబూబ్‌నగర్, నవంబర్ 21 : మాగనూర్ పాఠశాలలో మధ్యా హ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు తీ వ్ర అస్వస్థతకు గురికావడం దురదృష్టకరం, అయితే వైద్యం కోసం జిల్లా దవాఖానకు వచ్చిన వి ద్యార్థులకు ఇక్కడా ఉదయం పురుగుల టిఫినే ఇవ్వడం ఏంటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉం టే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూ రు జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వారు తెలుసుకున్నారు. అయితే విద్యార్థులు తాము అనారోగ్యంతో దవాఖానకు వస్తే ఇక్కడ ఉదయం టిఫిన్ కూ డా పురుగులతో కూడినదే పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సూపరింటెండెంట్ సంపత్కుమార్సింగ్ను విద్యార్థులకు పురుగులతో కూడిన టిఫిన్ ఎలా పెడతారని నిలదీశారు. వెంటనే విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అ నంతరం దవాఖాన ఆవరణలో విలేకరులతో మాజీ మంత్రి మాట్లాడుతూ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మహబూబ్‌నగర్ దవాఖానకు వస్తే ఇక్కడ పురుగుల ఉప్మా పెట్టారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారన్నారు.
పేద ప్రజల కోసమే కష్టపడి పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు వారే ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని, మేము అధికారంలో ఉ న్నప్పుడు డైట్ చార్జీలు పెంచి ఇచ్చామని, తీరా పురుగుల అ న్నం పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దవాఖానల్లో మందులు, వైద్యు లు కొరత ఏర్పడిందన్నారు.
దీని వల్ల పేదలకు మెరుగైన వై ద్య సేవలు అందడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాం లో దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్లు, మందులు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తే కనీసం నిర్వహణ చేసుకొనే పరిస్థితి కూడా లేదన్నారు. పురుగుల టిఫిన్‌పై ప్రతిపక్ష నాయకులు ఉట్టిగానే దుమ్మెతిపోస్తున్నారని అంటున్నారని, ప్రత్యక్ష సాక్షంగా మీ దవాఖాన వైద్య సిబ్బంది ఉన్నారని తెలుసుకోవాలని అన్నారు. అక్కడ భోజనం వికటించి వచ్చిన విద్యార్థులకు మళ్లీ అదే మాదిరిగా పురుగులతో కూడిన టిఫిన్ పెట్టడంతో మళ్లీ వాళ్ల పరిస్థితి ఏమైతుండే అని, మరీ ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.
జాగ్రత్తలు తీసుకోకుండా వైద్యసేవలు ఎలా అందిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారు, తిరగబడే రోజులు వస్తున్నాయని తస్మాత్ జాగ్రత్త అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు.
నిన్న 500 మంది విద్యార్థులు ఉండే మాగనూర్ పాఠశాలలో కొద్ది మందే అస్వస్థతకు గురయ్యారు. మొత్తం విద్యార్థులు అస్వస్థతకు గురైతే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే ఒళ్లు జ లదరిస్తుందన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు అండగా ఉండి వారి తరఫున ప్రభుత్వంతో పో రాటం చేస్తామని ఎవరూ ఆందోళనకు గురికావద్దని విద్యార్థు ల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నిన్న మాగనూర్ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 35మంది అనారోగ్యానికి గురికావడం బాధాకరం అన్నారు.
అస్వస్థతకు గురై జిల్లా ద వాఖానకు వైద్యం కోసం వస్తే ఇక్కడా అదేరకంగా పురుగుల టిఫిన్ పెట్టడం దురదృష్టకరం అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం తో ప్రభుత్వం చెలగాటడం ఆడడం ముమ్మాటికీ తప్పే, దీనిపై వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే సమాధానం చెప్పాలన్నారు. మీకు పిల్లలు ఉన్నారు. ఇదే ఆహారం పెట్టండి అప్పుడు తెలుస్తుంది నొప్పి, పేద పిల్లలు అంటే ఆట లా? పిల్లలు దేవుళ్లతో సమానం, వారిపై నిర్లక్ష్యం వహించడం సహించరానిదని దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.