మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 26 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని తెలంగా ణ చౌరస్తాలో విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా కుట్ర చేస్తుందని ఆరోపించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వేలాదిమంది ఫీజు రీ యింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ రాని కారణంగా యాజమాన్యాలు విద్యార్థుల విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆరోపించారు.