వనపర్తి టౌన్, అక్టోబర్ 27 : ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహిం చారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మెత్తాన్ని విడుదల చేసేంత వరకు విద్యార్థుల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, అందులో భాగంగానే వారికి చెల్లించాల్సిన ఫీజు రీయిం బర్స్మెంట్ చెల్లించడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీస్తే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వమని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు టెండర్లు, సహచర మంత్రులపై కామెంట్లు చేయడంలోనే మునిగిపోయి విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశార న్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, శివకుమార్, పవన్, శివ, బంటి, నితిన్, భరత్, పరమేశ్, అనిల్, రూపేశ్, కుమార్, అరవింద్, సంతోష్, మోహన్, జగదీశ్, జితేందర్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.