అలంపూర్/ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 3 : విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆ ప్రిన్స్‌పాల్ మాకొద్దని విద్యార్థులు మరోమారు రోడ్డెక్కిన ఘటన ఎర్రవల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే ఎర్రవల్లి మండలం బీచుపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కొంతకాలంగా విధులను నిర్తక్షంగా వ్యవహరిస్తున్నాడని, ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని, ముఖ్యంగా చదువు, భోజన మెనూ విషయంలో పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పదిహేను రోజుల కిందట గురుకుల పాఠశాల నుంచి సుమారు 19 కిలో మీటర్లు కాలినడకన జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం విధితమే. కలెక్టర్ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ సబ్యులు గురువారం గురుకుల పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించి నివేదికలు ఉన్నతాదికారులకు అందజేశారు.
అయితే మరుసటి రోజు కూడా గతంలో మాదిరిగానే ప్రిన్సిపాల్ శ్రీనివాసులు యథావిధిగా విధులకు హాజరు కావడంతో అధికారుల తీరులో ఏ మాత్రం మార్పులు జరగలేదని విద్యార్థులు గమనించిన విద్యార్థులు ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోలేదనే నెపంతో ఉన్నట్టుండి మరో మారు గురుకుల పాఠశాల ఎదుట ఉన్న 44వ జాతీయ రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల సిబ్బంది కలుగజేసుకుని విద్యార్థులకు నచ్చజెప్పి పాఠశాలలోకి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటన జిల్లాలో వైరల్‌గా మారింది. ఇకనైనా అధికారులు చొరవ చూపి మా సమస్యలకు పరిష్కారం చూపెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికారులు తీరుకు అద్దం పట్టేలా ఈ ఘటన ఉందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఆరేళ్లుగా ఎంతో కష్టపడి ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తూ వాలీబాల్ ఆడుతున్నా.. అమ్మానాన్నల ఆశయ సాధనలో భాగంగా ముందుకు అడుగులు వేస్తున్నా.. ఎస్జీఎఫ్ అండర్-19లో నా వంతుగా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించా.. అన్ని మ్యాచ్‌లలో కష్టపడ్డా.. కష్టం మాది.. ఫలితం వేరేవారికి అంటే మనసొప్పడం లేదు. క్రీడాస్ఫూర్తిని చాటాలని అనుకున్నా.. ప్రతిభ ఆధారంగా ఎంపిక జరిగితే బాగుంటుందని భావిస్తున్నా. ఫైనల్ జాబితాలో పేరు తారుమారు చేయడం చాలా బాధగా ఉంది. కలెక్టర్, అధికారులు న్యాయం చేయాలి.
– సింగనమోని కీర్తి, టీజీ ఆర్జేసీ బాలానగర్
కరీంనగర్లో నిర్వహించే అండర్-17 రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యావని సారోళ్లు చెప్పారు. కానీ నాకు అవకాశం కల్పించలేదు. మాదీ ఖిల్లాఘణపురం మండలం మానాజీపేట. అమ్మానాన్న నాగమ్మ, మల్లన్న నన్ను కష్టపడి ఇంతదూరం పంపించి ఉన్నతస్థాయిలో రాణించాలనే తలంపుతో కృషి చేస్తున్నారు. మాలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించాల్సిన వారే ఇలా చేయడం విచిత్రంగా ఉంది. కాళ్లు, చేతులకు దెబ్బలు తగిలి, గాయాలు బాధిస్తున్నా.. కడుపు మాడ్చుకుని కష్టపడ్డాం. ఇప్పుడు ఇలా చేయడం సరికాదు..
– నందిని, టీజీ ఆర్జేసీ, బాలానగర్
ఎస్జీఎఫ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన వాలీబాల్ అండర్-19లో ఫైనల్ జాబితాలో పేరు తారు మారు విషయంపై మాకు ఫిర్యాదులు అందాయి. వాటిపై సంబంధిత నిర్వాహకులు, ఫిజికల్ డైరెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా చూస్తాం.
– శ్రీనివాస్, జిల్లా క్రీడల నిర్వహణాధికారి, మహబూబ్‌నగర్