బాలానగర్, ఆగస్టు 11 : మండల కేంద్రంలోని బాలికల గురుకులం సమస్యలకు నిలయంగా మా రింది. చదువులో ఉన్నత ఫలితాలు.. క్రీడల్లో జాతీ య స్థాయి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులున్న స రస్వతీ నిలయంలో అటు పాలకులు.. ఇటు అధికారులు అభివృద్ధికి శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 ఏండ్ల కిందట బాలికల గురుకులం నిర్మించగా.. పాఠశాల, జూనియర్ కళాశాలకు సంబంధించి సుమారు 650 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
అయితే భోజనశాల సరిపోకపోవడంతో విడుతల వారీగా భోజనం వడ్డిస్తున్నారు. శిథిలమైపోయి.. ఎప్పుడు కూలిపోతుందో తెలియని వంట గదిలో భయపడుతూ వం టవాళ్లు వండిపెడుతున్నారు. డార్మిటరీలు చాలకపోవడంతో విద్యార్థులు తరగతి గదుల్లోనే పడుకుంటున్నారు. వర్షం వస్తే కురుస్తుండడంతో ప్రమాదకరంగా చదువులు చదవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. విద్యుత్ బోర్డులు తడిసిపోయి గోడలను తాకితే షాక్ కొడుతుందని మరికొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని ఇరుకుగదుల్లో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో సమస్యలకు కేరాఫ్‌గా మారింది.
భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చె బుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నాసిరరకంగా ఉండడమే ఇందుకు కారణం.. పురుగులు ఉన్న బియ్యాన్ని తిరిగి పంపిస్తున్నామని, ఆపై సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు యథావిధిగా ఉంటున్నాయని స్కూల్ టీచర్లు చెబుతున్నారు. ఇక్కడ నెలకొన్న స మస్యలపై పాలకులు, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.
భోజనంలో అప్పుడప్పుడూ పురుగులు వస్తున్నాయి. నాణ్యతగా భోజనం వడ్డించాలి.అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ రాత్రి 7:15 గంటలకు భోజనం పెడుతున్నారు. పండ్లు, గుడ్లు కూడా అందిస్తున్నారు.
– జయలక్ష్మి, 8వ తరగతి, బాలానగర్ గురుకుల పాఠశాల
బియ్యం నాణ్యతగా లేకపోవడంతో భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయి. పురుగుల అన్నం తినాలంటేనే ఎట్లాగో ఉంటుంది. తినకుండా ఉంటే కడుపు మాడుతుంది. అలాగని తింటే కడుపులో నొప్పి వస్తుంది. అధికారులు స్పందించి మంచి భోజనం అందించాలి.
– లక్ష్మీప్రణతి, 7వ తరగతి, బాలానగర్ గురుకుల పాఠశాల