మక్తల్, నవంబర్ 21 : మాగనూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన చికిత్సకోసం బుధవారం రాత్రి మక్తల్ ప్రభు త్వ దవాఖానకు తీసుకువచ్చారు. కాగా దవాఖాన లో సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది ఒకే బెడ్‌పై ఇద్దరిద్దరు విద్యార్థులను పడుకోబెట్టి చికిత్సలు అందించారు.
అసలే అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యాన్ని అందించి నయం చేయాల్సి ఉండగా దవాఖానలో బెడ్ల కొరత కారణంగా ఒకే బె డ్‌పై ఇద్దరిద్దరు విద్యార్థులను పడుకోబెట్టి చికిత్సలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహ నం వ్యక్తం చేశారు. దీనికి తోడు మెరుగైన వైద్య సేవ లు అందించకపోవడంతో చేసేది లేక విద్యార్థులను వారి తల్లిదండ్రులు జిల్లా దవాఖానకు తరలించారు.